»   » ఆనుష్క: మత్తెక్కించే సెక్సీ అందాల గని (ఫోటోలు)

ఆనుష్క: మత్తెక్కించే సెక్సీ అందాల గని (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వీటీ అనే ముద్దుపేరున్న అనుష్క తన అందాల ప్రదర్శనతో కుర్రకారును స్వీట్ డ్రీమ్స్‌లోకి వెళ్లేలా చేస్తోంది. సరోజగా కవ్వించినా, భిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ చేసినా ఆమెకు ఆమే పోటీ..సాటి అన్నట్లుగా తెరను వేడిక్కిస్తోంది.

మొదట్లో అనుష్క అందాల ప్రదర్శనికే ప్రయారిటీ ఇచ్చింది. అయితే అరుంధతి నుంచి ఆమె ఇమేజ్ మారింది. అందులో ఆమె అద్బుతంగా నటించిందంటూ మీడియా ప్రశంసించింది. అంతేగాక అనుష్క సైతం తాను కేవలం అరుంధతి చిత్రంతోనే నటనకు అలవాటు పడ్డాను అంటుంది.

తొలినాళ్లలో గుర్తింపు, పాపులారిటీ కోసం హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోయిన అనుష్క, ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ పరంగా తన విశ్వరూపం చూపించింది. అటు అందం, మరో వైపు అభినయంలో ఆమెను మించిన వారు లేరు. అందుకే రుద్రమదేవి, అరుంధతి లాంటి భారీ ప్రాజెక్టులకు ఆమె హీరోయిన్‌గా ఎంపికయింది. అనుష్క గురించి వివరాలు స్లైడ్ షోలో....

కన్నడ భామ

కన్నడ భామ

కన్నడ భామ అనుష్క శెట్టి తెలుగు, తమిళ సినీ ప్రేమికుల కలల దేవత. బెంగుళూరు నగరానికి చెందిన అనుష్క యోగా శిక్షకురాలుగా కెరీర్ ప్రారంభించి, నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా సినీరంగంలో అడుగుపెట్టింది.

విక్రమార్కుడుతో గుర్తింపు

విక్రమార్కుడుతో గుర్తింపు

సూపర్ తర్వాత అస్త్రం, చింతకాయల రవి, ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. అందులో క్లైమాక్స్ లో జింతాత అంటూ ఆమె చేసే అభినయానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

తొలి ఐటం సాంగ్

తొలి ఐటం సాంగ్

చిరంజీవి స్టాలిన్ లో ఐటం సాంగ్ (ప్రత్యేక నృత్యం)చేసినా ఆ తర్వాత వాటికి దూరంగా ఉండిపోయింది. తన పాత్ర నచ్చి సినిమాలు చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటూ వస్తోంది.

తమిళంలో అలా...

తమిళంలో అలా...

తమిళంలో మాధవన్ సరసన రెండు చిత్రం ద్వారా పరిచయమైన ఆమె సూర్యతో చేసిన యముడు(సింగం)తో అక్కడివారికి ఆరాధ్య దేవతగా మారింది.

అప్ అండ్ డౌన్స్

అప్ అండ్ డౌన్స్

గోపీచంద్ తో చేసిన లక్ష్యం చిత్రం ఆమెకు మరోసారి లైఫ్ ఇచ్చింది. తర్వాత చేసిన డాన్, మహానంది చిత్రాలు నిరసపరిచినా ఆమె అవకాశాలపై వాటి ప్రభావం పడలేదు.

దశ తిరిగింది వాటి వల్లే...

దశ తిరిగింది వాటి వల్లే...

అనుష్క‌కి మేజర్ బ్రేక్ ఇచ్చిన చిత్రం 2009లో వచ్చిన అరుంధతి. ఆ తర్వాత ఆమెలోని నటిని వెలికి తీసిన చిత్రం వేదం (2010). ఈ రెండు చిత్రాలు లేకపోతే తన కెరీరే లేదు అంటుంది అనూష్క.

మంగుళూరు

మంగుళూరు

మంగుళూరులో పుట్టిన అనుష్క పాఠశాల మరియు కళాశాల విద్య అంతా బెంగుళూరులోనే జరిగింది. ఈమె మాతృభాష తుళు. కుటుంబ సభ్యులు ఈమెను స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారు.

బిసిఏ పట్టా

బిసిఏ పట్టా

బెంగుళూరు విశ్వవిద్యాలయానికి అనుసంధానంగా ఉన్న మౌంట్ కార్మెల్ కళాశాలనుండి బి.సి.ఏ పట్టా పొందింది.

ఆసక్తి లేక ఇటు వైపు

ఆసక్తి లేక ఇటు వైపు

అయితే కంప్యూటర్ రంగంలో పనిచేసే ఉద్దేశ్యమేమీ లేదని, ఫిట్‌నెస్ రంగంలో పనిచెయ్యాలని ఈమె అభిలాష. దీంతో యోగా శిక్షణ వైపు తన దారి మళ్లించింది.

సినిమా రంగంలోకి అలా..

సినిమా రంగంలోకి అలా..

ఈమె గురువు హీరోయిన్ భూమికా చావ్లాను పెళ్ళి చేసుకున్న ప్రఖ్యాత యోగా నిపుణుడు భరత్ ఠాకూర్. సినీ నటుడు నాగార్జున ఈమెను సినీరంగానికి పరిచయం చేశాడు.

బాండ్ గర్ల్‌గా అవకాశం

బాండ్ గర్ల్‌గా అవకాశం

అనుష్కకు అప్పట్లో బాండ్ గర్ల్ గా అవకాశం వచ్చిందని, అయితే ఆమె దాన్ని నిరాకరించినట్లు వార్తలు వినిపించాయి.

మైలురాయి

మైలురాయి

కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన అరుంధతి సినిమా ఈమె సినిమాలలో ఒక మైలురాయిగా నిలిచి ఈమెను ప్రఖ్యాత నటీమణిగా మార్చింది.

రికార్డులు బద్దలు కొట్టిన అరుంధతి

రికార్డులు బద్దలు కొట్టిన అరుంధతి

ఈ చిత్రంలో అనుష్క అరుంధతి మరియు జేజమ్మ పాత్రలను పోషించింది. 13 కోట్ల పెట్టుబడితో తీసిన ఈ చిత్రం అత్యద్భుత విజయాన్ని సాధించి 68 కోట్లను వసూలు చేసింది. అందులో 10 కోట్లు తమిళనాడు నుండే వసూలయ్యాయి. ఈ సినిమాను తమిళంలో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేశారు.

అవార్డులే అవార్డులు

అవార్డులే అవార్డులు

అనుష్క అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌కు ఇప్పటికే పలు అవార్డులు అందాయి. తెలుగులో అరుంధతి, వేదం చిత్రాలకుగాను అనేక అవార్డులు దక్కించుకుంది.

రుద్రమదేవి

రుద్రమదేవి

ప్రస్తుతం అనుష్క గుణశేఖర్ దర్శకత్వంలో ‘రుద్రమదేవి' అనే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె కాకతీయ వీరవనిత రుద్రమదేవిగా కనిపించబోతోంది.

బాహుబలి

బాహుబలి

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం ‘బాహుబలి'లో కూడా అనుష్క ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది.

English summary
Anushka Shetty is an Indian film actress, who works mainly in the Telugu and Tamil film industries. Born in Mangalore, Shetty started her career as a Yoga instructor. It was while teaching Yoga, she got an offer to act in films. She thus made her acting debut through the 2005 Telugu film Super.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu