»   » గంగలో కలిసిపోయిన అనుష్క సినిమా కెరీర్!

గంగలో కలిసిపోయిన అనుష్క సినిమా కెరీర్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అరుంధతి చిత్రంతో ఆల్ టైమ్ రికార్డులను సష్టించిన యోగా బ్యూటి సుందరి అనుష్క త్వరలో తెరమరుగు కాబోతోందా! అంటే అవుననే వార్తలే వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే స్టార్ హీరోలందరి సరసన నటించిన అనుష్కకు ఇకపై లేడి ఓరియంటెడ్ చిత్రాలు లేదా మళ్ళీ స్టార్ హీరోలు ఏమైనా దయ చూపితేనే చిత్రాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఎందుకంటే ప్రస్తుత హీరోయిజం అంతా కొత్తవారిని తమ కన్నా తక్కువ వయసు ఉన్న వారిని, తమ హైటు, వైయిటుకి సరిపోయే వారిని మాత్రమే కోరుకుంటున్నారు. మరియైతే అరుంధతిలో ఆంటీగా కనిపించిన అనుష్కను కుర్రహీరోలు ఎవరూ కోరుకోవడం లేదు ప్రస్తుతం ఆమెను ఆహ్వానిస్తున్న చిత్రాలు కూడా అన్నీ లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కావడంతో ప్రేక్షకులు కూడా ఎంతకాలం అని అనుష్కను లేడీఓరియంటెడ్ పాత్రలో చూడగలరు చెప్పండి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం వస్తున్న హీరోలు బొమ్మాళీని అక్కా..అని పిలుస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఉన్న ఎత్తు కానివ్వండి ఆమె ఎన్నుకుంటున్న పాత్రలు కానివ్వండి వారి చేత అలా అనిపిస్తున్నాయి. అరుంధతి చిత్రానికి ఆమె చేసిన పాత్ర ఆ చిత్రానికి ఎంతో ఉపయోగపడినా తన సినిమా కెరీర్ కు మాత్రం పెద్ద దెబ్బే పడిందని సినీ పండితులు అంటున్నారు. అలాంటప్పుడు ముందు ముందు లేడీ ఓరియంటెడ్ పాత్రలు కాకుండా ఆమెకు చిత్రాలు రావాలంటే చిరంజీవి, బాలకష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, గోపిచంద్ వంటి వారు సినిమాలు చేస్తేనే ఆమెకు అవకాశాలు వస్తాయి.

వీరిలో చిరంజీవి ప్రస్తుతం లేక పోయిన, మిగతా హీరోలు సంవత్సరానికి ఒక్క చిత్రం చేయడానికి చాలా కష్టపడుతున్నారు. వీరు కూడ కొత్త హీరోయిన్స్ పైన మనసుపడటంతో త్వరలో అనుష్క..ఆవిరైపోనుందని స్సష్టంగా తెలుస్తుందని సినీ విమర్శకులు అంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu