గెరిల్లా పోరాట యోధురాలిగా అనుష్క ఓకే

By Srikanya

అనుష్క కొత్తగా 'రంపచోడవరం"అనే టైటిల్ తో ఓ చిత్రం చేయటానికి కమిటైంది. 1930 లో బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం సాగించిన ఓ యోధురాలి కథ ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆమె అడవుల్లో ఉండి పోరాటం చేసే వీరనారిగా కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని 'బాణం" చిత్రాన్ని డైరెక్ట్ చేసిన చైతన్య దంతులూరి డైరక్ట్ చేస్తున్నారు. నాగార్జునతో శ్రీరామదాసు చిత్రం నిర్మించిన కొండా కృష్ణంరాజు నిర్మిస్తున్నారు.

జే.కే.భారవి రచన చేస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. అరుంధతి తరహాలో పూర్తిగా ఆమె చుట్టూ తిరిగే ఈ కథ తో ఆమె తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకోవటానికే ఓకే చేసిందంటున్నారు. ఇక ఈ పీరియడ్ డ్రామాని దంతులూరి చైతన్య చేతిలో పెట్టడానికి కారణం అతను బాణం చిత్రాన్ని కూడా గత కాలంలో జరిగే కథగా రియాలిటీ దగ్గరగా ఉండేలా తీర్చిదిద్దటమేనంటున్నారు. ఇక ఈ చిత్రం తెలుగు,తమిళం,మళయాళం బాషల్లో తెరకెక్కనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X