»   » ప్రభాస్, అనుష్క.... ఇద్దరూ వాడుకుంటున్నారు!

ప్రభాస్, అనుష్క.... ఇద్దరూ వాడుకుంటున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి-2 సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆ క్రేజ్ ను వాడుకోవాలని డిసైడ్ అయ్యారు ప్రభాస్, అనుష్క. బాహుబలి-2 రిలీజ్ ప్రింటుతో పాటు వీరు నటించిన ఇతర సినిమాల టీజర్లు అటాచ్ చేయబోతున్నారట.

బాహుబలి ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో ఇటీవలే ఓ సినిమా మొదలు పెట్టారు. అనుష్క కూడా 'భాగమతి' అనే సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల టీజర్లు 'బాహుబలి-2' రిలీజ్ ప్రింటుతో అటాచ్ చేయబోతున్నారట.

ప్రభాస్-సుజీత్ ప్రాజెక్టుతో పాటు.... అనుష్క 'భాగమతి' చిత్రాన్ని కూడా యూవి క్రియేషన్స్ వారే నిర్మిస్తున్నారు....

ప్రభాస్-సుజీత్ ప్రాజెక్ట్ విలువ రూ. 150 కోట్లు

ప్రభాస్-సుజీత్ ప్రాజెక్ట్ విలువ రూ. 150 కోట్లు

దాదాపు మూడున్నరేళ్లుగా'బాహుబలి' ప్రాజెక్టే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.... ఆ సినిమా షూటింగ్ పూర్తవడంతో అందులో నుండి బయటకు వచ్చి ఇతర సినిమాలపై దృష్టి సారించారు. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కొత్త చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభం అయింది. యూవి క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న ఈచిత్రం దాదాపు రూ. 150 కోట్ల తో తెలుగు, తమిళం, హిందీల్లో ఒకే సారి చిత్రకరించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

అనుష్క భాగమతి

అనుష్క భాగమతి

అనుష్క భాగమతి సినిమా విషయానికొస్తే ఇదో గ్రాఫికల్ హారర్ కామెడీ మూవీ. అనుష్క కీలక పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అనుష్క అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

బాహుబలి 2 మీద మళ్లీ విమర్శలు, కాపీ కొట్టారంటూ...

బాహుబలి 2 మీద మళ్లీ విమర్శలు, కాపీ కొట్టారంటూ...

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘బాహుబలి'. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మొదటి భాగం ‘బాహుబలి-ది బిగినింగ్' మంచి విజయం సాధించింది. త్వరలో రెండో భాగం రాబోతోంది. అయితే ఇటీవల శివరాత్రికి విడుదలైన పోస్టు మీద కొన్ని విమర్శలు వచ్చాయి.

English summary
Anushka next movie Trailer to be attached to Baahubali 2. We have already broken the news that Prabhas's next film being directed by Sujith will be commencing to shoot the teaser first in a bid to attach that to the prints of "Baahubali 2". Latest information is that Anushka's "Bhagamati" too would be doing the same.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu