»   » అనుష్క 'సైజ్‌ జీరో' ‌: 9 మంది స్టార్స్ గెస్ట్ రోల్స్

అనుష్క 'సైజ్‌ జీరో' ‌: 9 మంది స్టార్స్ గెస్ట్ రోల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సైజ్‌ జీరో' . ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఈ 'సైజ్‌ జీరో' చిత్రంలో ఏకంగా తొమ్మిది మంది స్టార్స్ గెస్ట్ లుగా కనిపించి,అలరించబోతున్నారు. వీరందరికీ కథలో గెస్ట్ అప్పీరియన్స్ లు మాత్రమే కాదని, కథకు ఇంపార్టెంట్ ఉన్నవి అంటున్నారు. ఇంతకీ ఎవరా స్టార్స్ అంటే క్రింద స్లైడ్ షో చూసి తెలుసుకోవాల్సిందే.


ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న షేడ్స్ లో కనిపించనుంది. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు' సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ సినిమా కావటంతో బిజినెస్ పరంగానూ చాలా క్రేజ్ తో విడుదల కానుంది.


స్లైడ్ షోలో ...ఆ గెస్ట్ లు ఎవరో తెలుసుకోండి


నాగార్జున

నాగార్జునఈ చిత్రంలో నాగార్జున స్మార్ట్ అండ్ సింపుల్ క్యారక్టర్. ''సూపర్‌'తో అనుష్కని తెలుగు తెరకు పరిచయం చేసింది నాగార్జున. అందుకే అనుష్క నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.


ముగ్గురు హీరోయిన్స్...

ముగ్గురు హీరోయిన్స్...


హన్సిక, తమన్నా, కాజల్‌.. ఈ ముగ్గురూ అనుష్కకు మంచి స్నేహితులు. 'సైజ్‌ జీరో' కథ వాళ్లకు బాగా నచ్చింది. ఓ మంచి ఉద్దేశంతో తెరకెక్కించిన ఈ చిత్రంలో తాము కూడా భాగస్వాములు కావాలనుకొన్నారు.వీళ్లిద్దరూ...

వీళ్లిద్దరూ...


రానా, మంచు లక్ష్మీ ప్రసన్నలతో దర్శకుడు ప్రకాష్‌ కోవెలమూడికి మంచి అనుబంధం ఉంది. అందుకే వాళ్లిద్దరూ ఓ సన్నివేశంలో మెరుస్తారు.శ్రీదివ్య

శ్రీదివ్య

అలాగే ఆర్యతో కలసి శ్రీదివ్య 'బెంగళూర్‌ డేస్‌' చిత్రంలో నటించింది. ఆ అనుబంధంతో శ్రీదివ్య ముందుకొచ్చింది.అందుకే.

అందుకే.

.

ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రేమతోనో, నటీనటులపై ఉన్న అభిమానంతోనో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు... అని చిత్ర యీనిట్ చెబుతోంది.


ఫేక్ కాదు..

ఫేక్ కాదు..‘నేను లావుగా కనిపిస్తున్న లుక్ ఫేక్ కాదు. ఆ సినిమాకోసం నేను కార్బోహైడ్రేట్స్ తీసుకొని లావు అయ్యానని' అని అనుష్క తెలిపింది.ఏకంగా 17 కేజీలు

ఏకంగా 17 కేజీలు


'సైజ్‌ జీరో' చిత్రంలో ఆమె లావుగా కనపడటం అబద్దమని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె టీవి 9 తో మాట్లాడుతూ ఇలా స్పందించింది. 17 కిలోలు ఆమె ఈ సినిమా కోసం పెరిగింది.నవల ఆధారంగా...

నవల ఆధారంగా...యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది.హైలెట్..

హైలెట్..


ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించంట హైలెట్.


భార్య సహకారం

భార్య సహకారం


ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ - స్క్రీన్ ప్లే అందించింది.


English summary
Size Zero has Arya and Anushka playing the lead roles ably supported by Sonal Chauhan, Urvashi, Prakash Raj, Barath and others. Produced by PVP Cinema, Size Zero is directed by Prakash Kovelamudi, script by Kanika Dhillon, art by Anand Sai, edited by Pravin Pudi with Music by M M Keeravaani and Camera by Nirav Shah.
Please Wait while comments are loading...