»   »  అనుష్క కోసం రకుల్‌ప్రీత్‌ ఫన్ (వీడియో)

అనుష్క కోసం రకుల్‌ప్రీత్‌ ఫన్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అనుష్క, ఆర్య ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'సైజ్‌ జీరో' . చిత్రం ప్రమోషన్ లో భాగంగా జీరో సైజ్ ..జీరో సైజ్ అనే సెక్సీ సాంగ్ ని యూనిట్ విడుదల చేసింది. ప్రకాష్‌ కోవెలమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. అనుష్క, ఆర్య, సోనాల్‌ చౌహాన్‌ ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. 'సైజ్‌జీరో' చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా రకుల్‌ప్రీత్‌ చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు.

రకుల్‌ ప్రీత్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా 'సైజ్‌ జీరో' చిత్రంలోని ఓ సన్నివేశంలో అనుష్కని అనుకరించి రూపొందించిన వీడియోని అభిమానులతో పంచుకున్నారు. తన స్నేహితురాలు అనుష్కకి శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. ఆ వీడియోని ఇక్కడ చూడండి.


Wishin my fav actress #Anushka , #pkovelamudi n d team of #SizeZero all d best. Here's a surprise #SizeZeroDubsmash


Posted by Rakul Preet on23 November 2015


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం విశేషాలకు వస్తే...


‘నేను లావుగా కనిపిస్తున్న లుక్ ఫేక్ కాదు. ఆ సినిమాకోసం నేను కార్బోహైడ్రేట్స్ తీసుకొని లావు అయ్యానని' అని అనుష్క తెలిపింది. 'సైజ్‌ జీరో' చిత్రంలో ఆమె లావుగా కనపడటం అబద్దమని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆమె టీవి 9 తో మాట్లాడుతూ ఇలా స్పందించింది. 17 కిలోలు ఆమె ఈ సినిమా కోసం పెరిగింది.


Anushka's latest Size Zero guests

ఈ సినిమాలో అనుష్క రెండు విభిన్న షేడ్స్ లో కనిపించనుంది. యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది.


ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా ఆర్యా, భరత్, ఉర్వసీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హీరోయిన్ శృతిహాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో షూటింగ్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి ప్రకాష్ కోవెలమూడి భార్య అయిన కనిన ధిల్లన్ కథ - స్క్రీన్ ప్లే అందించింది.

English summary
A new 'size zero' song from the film "Size Zero" got released. The song features a fatty Anushka working it hard to get a slim body. Size Zero has Arya and Anushka playing the lead roles ably supported by Sonal Chauhan, Urvashi, Prakash Raj, Barath and others.
Please Wait while comments are loading...