»   »  అనుష్క బహిరంగ లేఖ: ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందా?

అనుష్క బహిరంగ లేఖ: ప్రేక్షకులను ప్రభావితం చేస్తుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి, రుద్రమదేవి చిత్రాల తర్వాత అనుష్క చేస్తోన్న చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రంలో ఆమె గత సినిమాలకు భిన్నంగా బొద్దుగా, లావుగా కనిపించబోతోంది. ఇందుకోసం ఎంతో కష్టపడి బరువు పెరిగింది. ఈ రోజు ఈ మూవీ విడుదలవుతున్న నేపథ్యంలో ఆమె ఓ బహిరంగ లేఖ రాసారు. ఈ లేఖ ప్రభావం తప్పకుండా ప్రేక్షకుల మీద ఉంటుందని, ఫ్యామిలీ ప్రేక్షక్షులను సినిమా వైపు ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.

Anushka's open letter about Size Zero

అనుష్క లెటర్ ఇలా...
హాయ్.. అందరూ బాగున్నారా. నేను బాగానే ఉన్నాను. నిజానికి కొంచెం బరువుగా ఉన్నాను. ఇబ్బందిగానే ఉంది. బాహుబలి షూటింగు స్టార్ట్ అయ్యేలోపు ఇంకా చాలా తగ్గాలి. తగ్గుతానని కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాను.

నేను మనస్ఫూర్తిగా నమ్మి చేసిన సినిమా సైజ్ జీరో. అందుకోసం బాగా బరువు పెరిగాను. కానీ ఇష్టంగానే ఎందుకంటే స్వీటీ క్యారెక్టర్ తో అంత బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి.

Anushka's open letter about Size Zero

ప్రతి మదర్-డాటర్ రిలేషన్ చాలా స్పెషల్. ఈ మూవీలో నేను కూడా మా అమ్మతో అలాంటి రిలేషన్ షిప్ షేర్ చేసుకున్నాను. ప్రతి తల్లికి తన కూతురిని ఏ ప్రిన్స్ చార్మింగ్ కో ఇచ్చి పెల్లి చేయాలని ఉంటుంది. మా అమ్మ డిఫరెంట్ కాదు. నా పెళ్లి కోసం తను చేయని వ్రతం లేదు. అడగని దేవుడు లేడు.

నేను చాలా విదాలుగా రిలేట్ అయిన క్యారెక్టర్ స్వీటీ. ఇందులో సిట్యేషన్స్, మూమెంట్స్ అన్ని నేను నాకు తెలిసిన వాళ్లు ఫేస్ చేసినవే. బరువుకు సంబంధం లేకుండా ప్రతి అమ్మాయికి తన లైప్ గురించి చాల డ్రీమ్స్ ఉంటాయి. నాలా..స్వీటీలా.. రండి కలిసి ఆ డ్రీమ్ ఎక్స్ ప్లోర్ చేద్దాం.

మీ అందరూ నా ఫ్యామిలీ. ఇది ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా. మనం అందరం ఈరోజే సైజ్ జీరో సినిమా చూద్దాము. మీ అనుష్క (స్వీటీ)

English summary
Anushka Open Letter to Her fans About Size Zero Movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu