»   »  అనుష్క ‘సైజ్ జీరో’ రిలీజ్ డేట్ వచ్చేసింది

అనుష్క ‘సైజ్ జీరో’ రిలీజ్ డేట్ వచ్చేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ ప్రొడక్షన్ నెం.10గా నిర్మించిన చిత్రం ‘సైజ్ జీరో'. ప్రకాష్ కోవెలమూడి దర్శకుడు . ‘బాహుబలి' వంటి విజువల్ వండర్ లో దేవసేన పాత్రలో అలరించిన స్టార్ హీరోయిన్ అనుష్క త్వరలోనే డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘సైజ్ జీరో'తో మన ముందుకు రానుంది.

తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ‘సైజ్' జీరో చిత్రాన్ని నవంబర్ 27న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో అనుష్క గత సినిమాల కంటే భిన్నంగా లావుగా కనిపించబోతోంది. ఆ మధ్య ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేసారు. ఇందులో అనుష్కను చూసిన అభిమానులు ఆమె భారీ కాయంతో ఉండటాన్ని చూసి షాకయ్యారు. తమ కలల దేవతనను తెరపై ఇలా చూస్తామని వారు బహుషా ఊహించి ఉండరు.

 Anushka’s Size Zero to release on 27th of November

డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం వెయిట్ లాస్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం అనుష్క దాదాపు ఇరవై కేజీల బరువు పెరిగింది. బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ‘సైజ్ జీరో' సినిమా ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో భారీ క్రేజ్ ను క్రియేట్ చేసింది.

ఈ చిత్ర కథాంశం ప్రకారం అనుష్క భారీ లుక్ తో కనపడనుంది. అలాగే ఆర్య స్టయిలిష్ లుక్స్ తో ఈ రొమాంటిక్ కామెడిలో దర్శనమిస్తున్నాడు. టెక్నిషియన్స్ పరంగా కూడా యూనిట్ భారీగానే కనపడుతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు యం.యం.కీరవాణి, నిరవ్ షా వంటి సినిమాటోగ్రాఫర్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే నిర్మాత పి.వి.పి కూడా ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవల్లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
After enthralling the audiences with her angry determination in Bahubali and royal valor in Rudramadevi, Anushka Shetty is all set to entertain with her endearing personality and humor in Size Zero. PVP Cinema, the producer of Size Zero, has officially announced the release date as the 27th of November.
Please Wait while comments are loading...