twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ మాత్రమే కాదు ...ఇప్పుడు అనుష్క కూడా, వ్యతిరేకించే మగాళ్ల కోసం

    ‘స్వచ్ఛభారత్’ ప్రచార కర్తగా ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రధాని నరేంద్ర మోదీ నియమించినట్లు సమాచారం.

    By Srikanya
    |

    ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్..'స్వచ్ఛభారత్‌' కు ప్రచారకర్తగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కూడా వచ్చి చేరింది. మినిస్ట్ర్రి ఆఫ్ అర్బన్ డవలప్ మెంట్ వారు ఆమెను తమ కాంపైన్ కు ఎంపిక చేసారని, ప్రధాన్ని స్వయంగా ఆమెను నియమించినట్లు తెలుస్తోంది.

    వరుస ఆఫర్స్, హిట్స్ తో దూసుకుపోతోంది బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ ని ఈ మిషన్ కు తీసుకోవటంతో యువతలోకి 'స్వచ్ఛభారత్‌' ని ప్రతిభావంతంగా తీసుకువెళ్లవచ్చని భావిస్తున్నారు .

    అనుష్క సుల్తాన్‌ సినిమాలో ఆర్ఫా అనే మల్లయోధురాలి పాత్రలో మెప్పించిన తీరు, ఎక్కువగా మహిళా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్నఅనుష్క తీరు నచ్చి ప్రభుత్వం ఆమెను ప్రచారకర్తగా ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.

    వ్యతిరేకిస్తున్న పురుషుల కోసం

    వ్యతిరేకిస్తున్న పురుషుల కోసం

    అంతేకాదు ఈ క్యాంపెయిన్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోమరుగుదొడ్ల నిర్మాణంపై వ్యతిరేకిస్తున్న పురుషులకు వాటిపై అవసరంపై అవగాహన కల్పించేందుకు అనుష్కప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు మీడియా వర్గాల సమాచారం.

    ఎంత బిజీగా ఉన్నా

    ఎంత బిజీగా ఉన్నా

    నటిగా, నిర్మాతగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, మరోపక్క స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ విరాట్‌ కోహ్లితో రిలేషన్‌షిప్‌ హ్యాండిల్‌ చేసుకుంటూ బిజీ అయిపోయినా అనుష్క శర్మ వెంటనే ఓకే చేయటం జరిగింది.

    ప్రధాని స్వయంగా

    ప్రధాని స్వయంగా

    ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన ‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌'లో పాలుపంచుకోవడానికి అనుష్క మద్దతు తెలిపింది. అంతేకాదు ఈ మిషన్‌కి ప్రచారకర్తగా అనుష్కను ప్రధాని నియమించినట్లు సమాచారం.

    మెగాస్టార్ కూడా

    మెగాస్టార్ కూడా

    పరిశుభ్రత, మెరుగైన జీవితం, శానిటేషన్‌, బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన నిర్మూలన స్వచ్ఛభారత్‌ ప్రచార మూలాంశాలు. ఇప్పటికే బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ కార్యక్రమంలో భాగంగా తనవంతు చేయూతనిస్తున్నారు.

    ఐదేళ్ళలో...

    ఐదేళ్ళలో...

    మోదీ స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్‌2న ప్రారంభించారు. ఐదేళ్లలో యావత్‌ భారతదేశం పరిశుభ్రతలో ముందుండాలన్నది ఈ ప్రచార కార్యక్రమ లక్ష్యం.

    వీలైనన్ని

    వీలైనన్ని

    కెరీర్ విషయానికి వస్తే..''తక్కువ సినిమాలు చేయడమే సౌకర్యంగా ఉంది. అయితే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయమని మొదట్లో నాకు చాలామంది సలహాలిచ్చేవారు. కానీ ఎక్కువ సినిమాలు చేయాలనే టార్గెట్‌ పెట్టుకొని నటించాలని ఎప్పుడూ అనుకోలేదు అంటోంది అనుష్క శర్మ

    గుర్తుండిపోవాలి అనుకునేదాన్ని

    గుర్తుండిపోవాలి అనుకునేదాన్ని

    విభిన్న పాత్రలతో మెప్పించాలని భావించా. ఎందుకంటే థియేటర్ల నుంచి బయటకు వచ్చినా నా పాత్ర వాళ్లకు గుర్తుండిపోవాలి అనుకునేదాన్ని. అదృష్టవశాత్తూ తొందరగా మరిచిపోయే పాత్రల్లో నటించలేదు. నా కెరీర్‌కి బలాన్నిచ్చే పాత్రల్లోనే నటించా. అదే ఇప్పుడు మంచి ఫలితాన్నిస్తుంది.'' అని చెప్పుకొచ్చింది అనుష్కశర్మ.

    మరో రెండు ఓకే..

    మరో రెండు ఓకే..

    గతేడాది అనుష్క నటించిన 'సుల్తాన్‌'.. 'యే దిల్‌హై ముష్కిల్‌' బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఆమె నటనకు మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆ రెండు సినిమాల విజయం తర్వాత మరో రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

    వూపిరి సలపనీయటం లేదు..

    వూపిరి సలపనీయటం లేదు..

    ''ఈమధ్య కాలంలో నిరంతరం షూటింగుల్లో పాల్గొంటున్నా. ఇటీవలే 'ఫిల్లౌరీ' షూటింగ్‌ ముగించుకున్నా. ఇంతియాజ్‌ అలీ సినిమా 'ది రింగ్‌'(వర్కింగ్‌ టైటిల్‌) చిత్రీకరణలో ఉన్నా. వూపిరి సలపనీయకుండా షూటింగుల్లో పాల్గొనడంతో కొద్దిగా అలిసిపోయినట్టుగా ఉంది. ఇటీవలి కాలంలో ఎక్కువ పనిచేస్తున్నట్లు అనిపించింది.'' అంటోంది అనుష్క.

    ఇప్పటికి ఓపెన్ కాలేదు

    ఇప్పటికి ఓపెన్ కాలేదు

    పెళ్లి అనేది ఎవరి చేతుల్లో ఉండదని, ఎప్పుడు జరగాలని ఉంటే అప్పుడే జరుగుతుందని ఈ బాలీవుడ్ బ్యూటీ భామ చెప్పుకొచ్చింది. అయిన నా లైఫ్ లో ప్రతీది దానికంతట అదే జరగుతూ వస్తోంది. పెళ్లి కూడా టైం వచ్చినప్పుడు అదే జరుగుతేందేమో అని చెప్తోంది అనుష్క. అనుష్క శర్మ పెళ్ళాడబోయే వ్యక్తి విరాట్ కోహ్లీనే అని అందరు భావిస్తోండగా, ఈ అమ్మడు మాత్రం ఇప్పటికి ఓపెన్ కాకపోవడం గమనర్హం.

    వివక్షత ఉంది

    వివక్షత ఉంది

    అనుష్క శర్మ మాట్లాడుతూ...ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. అందుకే మహిళల హక్కుల కోసం ఫెమినిస్టులు పోరాటం చేసున్నారు. నేను స్వేచ్ఛగా.. స్వతంత్రంగా నిర్ణయాలను తీసుకుంటా. నాలాగే మిగిలిన మహిళలు కూడా వారి నిర్ణయాలు వారే తీసుకోవాలని, స్వేచ్ఛగా, స్వతంత్రంగా అనుకుంటాను. ఈ సమాజంలో అందరు కలిసిమెలిసి ఉండాలి. అంతే గానీ.. స్త్రీ, పురుషులను ఒకరిని ఎక్కువ.. మరొకరిని తక్కువ చేసి చూడకూడదని, ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. సమాజంలో మనుషులు అందరు ఒక్కటే అని తన అభిప్రాయం చెప్పింది అనుష్క శర్మ.

    మంచి పాత్ర దొరికితేనే...

    మంచి పాత్ర దొరికితేనే...

    హాలీవుడ్ కు వెళ్లాలనే తొందర తనకు లేదని చెప్పింది. ఎవరు ఎక్కడైనా నటించవచ్చని చెప్పింది ఈ అమ్మడు. కానీ,.. తాను ఓ సినిమా చేసే ముందు, నటిగా తన ప్రతిభను ఆ సినిమా ఎంత మేర వెలికి తీస్తుంది? తన పాత్ర ఆసక్తికరంగా ఉందా ? అనే విషయాలను చూస్తానని చెప్పుకొచ్చింది. మంచి పాత్ర దొరికితే, హాలీవుడ్‌కి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.

    English summary
    After megastar Amitabh Bachchan, the gorgeous Anushka Sharma is the new celebrity entrant in the Swachh Bharat Abhiyan campaign.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X