»   » నీలికళ్ళు, నల్లని మచ్చలు: ఒళ్ళు జలదరించేలా అనుష్క లుక్

నీలికళ్ళు, నల్లని మచ్చలు: ఒళ్ళు జలదరించేలా అనుష్క లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కా శర్మ హీరోయిన్‌గా గ్లామరస్‌ లుక్‌లో కనిపించడమే కాదు. నిర్మాతగా సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను నిర్మించింది అనుష్క.క్లీన్ స్లేట్ ఫిల్మ్స్ బ్యానర్ పై చేసిన ణ్ 10 మంచి విజయం పొందింది. కాకపోతే క్రిటిక్స్ మెచ్చేసుకున్నా కూడా డబ్బులు మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత పంజాబ్ బ్యాక్ డ్రాప్ లో నిర్మించిన ఫిల్లౌరి కూడా నష్టం లేకుండా భారీ లాభాలు రాకుండా బాగానే ఆడింది. ఇంతవరకూ రెండు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఈ ముద్దుగుమ్మ, ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. "పరి" అనే సినిమాని నిర్మిస్తోంది

పరి ఫస్ట్‌లుక్‌

పరి ఫస్ట్‌లుక్‌

అనుష్క "పరి" ఫస్ట్‌లుక్‌ను ట్విటర్‌ ద్వారా విడుదల చేసింది.ఈ పోస్టర్ లో ఆమె లుక్ డిఫరెంట్ గా .. భయాన్ని కలిగించేలా వుంది. ఆమె ఈ సినిమాలో దెయ్యంగా కనిపించి భయపెట్టబోతోందని కొంతమంది అంటుంటే, మానసిక రోగిగా కనిపించనుందని మరికొంత మంది అంటున్నారు.

 సినిమాపై ఆసక్తిపెరిగింది

సినిమాపై ఆసక్తిపెరిగింది

మొత్తానికి ఈ పోస్టర్ తో ఈ సినిమాపై అనుష్క ఆసక్తిని రేకెత్తించిందనే చెప్పాలి. ఎప్పుడూ గ్లామరస్‌గా తెరపై ఆకట్టుకున్న అనుష్క ఉన్నట్టుండి ఇలాంటి గెటప్‌ వేయడంతో ఈ సినిమాపై ఆసక్తిపెరిగింది. ఈ చిత్రానికి ప్రోసిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయమై అనుష్క మాట్లాడుతూ..

జాబ్ హ్యారి మెట్ సెజల్

జాబ్ హ్యారి మెట్ సెజల్

పరి మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉంది. డైరెక్టర్ అంచనాలు, విజన్‌కు అనుగుణంగా సినిమాలో నటించేందుకు రెడీగా ఉన్నా. ఈ సినిమా కోసం క్రిఆర్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థతో పనిచేయడం ఆనందంగా ఉందని చెప్పకొచ్చింది. ఇతర సినిమాల విషయానికొస్తే.. అనుష్క షారుక్ జంటగా నటిస్తున్న సినిమా ‘జబ్ హ్యారి మెట్ సెజల్' విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లు తరువాత పరి షూటింగ్ ఉంటుంది అని చెబుతున్నారు.

భయంకరంగా కనిపిస్తోంది

భయంకరంగా కనిపిస్తోంది

ప్రస్తుతానికి వస్తే ఈ "పరి" లుక్ చూస్తూంటే అనుష్క భయపెట్టేందుకు సిద్ధమవుతోందని అర్ధమవుతోంది. నీలికళ్లతో, మొహమంతా నల్లని మచ్చలతో భయంకరంగా కనిపిస్తోంది అనుష్క. పరంబ్రతా ఛటర్జీ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దయ్యం కాన్సెప్టే కాకుండా ఈ సినిమాలో కొన్ని ఇంపార్టెంట్‌ సామాజిక అంశాల్ని కూడా హైలైట్‌ చేయనున్నారట.

అంచనాలు భారీగా ఉన్నాయి

అంచనాలు భారీగా ఉన్నాయి

విలక్షణ పాత్రలకు అనుష్క ఎప్పుడూ ముందుంటుంది. బాలీవుడ్‌లో వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా దూసుకెళ్లిపోతోంది ఈ ముద్దుగుమ్మ. అనుష్క లుక్‌ చూస్తుంటే తాజా చిత్రంపై కూడా అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా కూడా కమర్షియల్ గా నిలబడిందంటే అనుష్క సినీ నిర్మాణం పై మరింత సీరియస్ గా దృష్టి పెట్టే ఆలోచనలో ఉందట.

English summary
Bollywood actress Anushka Sharma recently shared the first look of her upcoming film Pari. The actress looks unrecognisable in the haunting poster
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu