»   » హీరోయిన్ అనుష్క సినిమాల్లోకి రాకముందు ఇలా.. (వీడియో)

హీరోయిన్ అనుష్క సినిమాల్లోకి రాకముందు ఇలా.. (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోయిన్లు ఎవరంటే అందులో తప్పకుండా వినిపించే పేరు అనుష్క శెట్టి. తెలుగులో సూపర్ సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క తొలి సినిమాతోనే తన అందం, నటనతో ఆకట్టుకుంది. అంతకంటే ముందు అనుష్క హిందీలో కూడా సినిమా అవకాశాల కోసం ట్రై చేసింది.

అప్పట్లో ఆమె హిందీ ఆడిషన్స్ కు వెళ్లిన ఓ రిహార్సల్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించింది. తాజాగా అనుష్క కూడా ఈ వీడియోను షేర్ చేసింది. అప్పటికి...ఇప్పటికి అనుష్కలో ఎంత మార్పు వచ్చిందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్‌గా పని చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు ఆమె బెంగుళూరులోని ఈస్ట్‌వుడ్ పాఠశాలలో కూడా పని చేసారు. నాగార్జున హీరోగా రూపొందిన 'సూపర్' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన అనుష్క గ్లామరస్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. స్వీటీ అనే ముద్దుపేరున్న అనూష్క తన అందాల ప్రదర్శనతో కొన్ని సినిమా్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

వేదంలో సరోజగా కవ్వించినా, బిళ్లాలో బికినీతో కనిపించినా, విక్రమార్కుడుతో అందాలతో విజృభించినా, రగడతో అందాల రచ్చరచ్చ, ఇటీవల వచ్చిన బాహుబలి, రుద్రమదేవి చిత్రాల్లో వీరనారిగా నటించినా ఆమెకు ఆమే పోటీ..సాటి అన్నట్లుగా వెండి తెరను ఏలుతోంది.

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హీరోయిన్ల పాత్రలు కేవలం అందాల ఆరబోతకు, హీరోలతో రొమాన్స్ చేయడానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. కానీ వీరందరికీ భిన్నంగా రాణిస్తోంది హాట్ అండ్ సెక్సీ తార అనుష్క.

అనుష్క

అనుష్క


ఈస్ట్‌వుడ్ పాఠశాలలో సహచర ఉపాధ్యాయులతో కలిసి అనుష్క, రెండో లైన్లో 7వ వ్యక్తి

ప్రస్తుతం అనుష్క

ప్రస్తుతం అనుష్క


ప్రస్తుతం అనుష్క బాహుబలి లాంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.

రాజమౌళి సినిమాతో

రాజమౌళి సినిమాతో


సూపర్ తర్వాత అస్త్ర, చింతకాయల రవి, స్వాగతం, ఒక్క మగాడు వంటి చిత్రాలు చేసినా రాని బ్రేక్ రాజమౌళి విక్రమార్కుడుతో వచ్చింది. అందులో క్లైమాక్స్ లో జింతాత అంటూ ఆమె చేసే అభినయానికి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

చిరుతో..

చిరుతో..


చిరంజీవి స్టాలిన్ లో ఐటం సాంగ్ (ప్రత్యేక నృత్యం)చేసినా ఆ తర్వాత వాటికి దూరంగా ఉండిపోయింది. తన ఇమేజ్‌కు తగిన సినిమాలు చేస్తూ విజయాలు సొంతం చేసుకుంటూ వస్తోంది. ఇటీవల చిరు 150లో ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారు. కానీ అనుష్క బాహుబలి ప్రాజెక్టుతో బిజీగా ఉండటం వల్ల వీలు కాలేదట.

తమిళం

తమిళం


తమిళంలో మాధవన్ సరసన ‘రెండు' చిత్రం ద్వారా పరిచయమైన ఆమె సూర్యతో చేసిన యముడు(సింగం)తో అక్కడివారికి ఆరాధ్య దేవతగా మారింది. తర్వాత సింగం 2లో కూడా చేసింది. ప్రస్తుతం సూర్య, అనుష్క కాంబినేషన్లో సింగం 5 కూడా వస్తోంది.

English summary
Here is the full video of the Anushka Shetty's hindi audition.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu