»   » ఔను..! హైదరాబాద్ లో అనుష్క స్థానం అదేనట

ఔను..! హైదరాబాద్ లో అనుష్క స్థానం అదేనట

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైద్రాబాద్ లో మోస్ట్ డిజైరబుల్ విమన్ ఎవరు? ఇదే ప్రశ్న హైదరాబాద్ టైమ్స్ అడిగితే ఇప్పటికీ అనుష్కనే నెంబర్ వన్ అని చెప్పేసారట హైదరాబాద్ వాసులు. .

టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ విమెన్ లిస్ట్ లో.. హైదరాబా లో ఇప్పటికీ అనుష్క టాప్ ప్లేస్ లో నిలవడం. చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వయసులోనూ అనుష్క ఇంకా కుర్ర హీరోయిన్ లని పక్కకు నెట్టి తన స్టామినా ఏమిటో నిరూపించుకుంది.

టాలీవుడ్ లో ఇప్పుడు ఏదన్నా టఫ్ రోల్ చేయాల్సి వస్తే మొదటగా అనుష్కనే ఎంచుకుంటారు దర్శకులు. నటన మీదా,గ్లామర్ ప్రదర్శన మీదా ఈ అమ్మడికి ఉన్న కమాండ్.. 30 ఏళ్ళ స్వీటీ శెట్టి ని టాప్ ప్లేస్ లో నిలబెడుతోంది. నిజానికి బాహుబలికి ముందు అనుష్క క్రేజ్ బాగా తగ్గిందనే అనుకున్నారు.

Anushka Shetty Most Desirable Women and Most Desirable man Mahesh Babu

అరుంధతి తర్వాత అనుష్కకి సరైన హిట్ లేక కాస్త వెనకబడింది. అయితే బాహుబలిలో దేవసేన పాత్రతో అనుష్క రేంజ్ మళ్లీ ఒక్కసారిగా టాప్ పొజిషన్ కి వెళ్ళిందనే చెప్పాలి. స్క్రీన్ పై కనిపించిన్ది కాసేపే అయినా.. తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది,తన నటనతో ఆకట్టుకుంది అనుష్క.

అయితే 30ల్లోనూ మోస్ట్ డిజైరబుల్ అనిపించుకోవడం అంత సులువైన విషయమేమీ కాదు. కానీ అనుష్క మాత్రం ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఇలాంటి నెంబర్ గేమ్ ని అసలు పట్టించుకోనని అంటోంది.

నా ఏజ్ కంటే ఇండస్ట్రీకి నా ఫేస్ చాలా ముఖ్యం. దీన్ని కాపాడుకోవడాన్ని నేను బాగా ఇష్టపడతాను. ఆరోగ్యంగా సంతోషంగా ఉండడమే నా సీక్రెట్' అంటోంది అనుష్క...

టైమ్స్ ఆఫ్ ఇండియా ఇదే సర్వేని మేల్ యాక్టర్స్ విశయం లోనూ చేసింది. మేల్ నటుల్లో ఈ స్థానం ప్రిన్స్ మహేష్ బాబునే వరించింది. మోస్ట్ డిజైరబుల్ నటుడిగా ఈ సంవత్సరం మహేష్ నే ఎన్నుకున్నారట తెలుగు అభిమానులు

English summary
Hyderabad Times - 25 Most Desirable Women, Sweety Shetty aka Anushka Shetty is undoubtedly No.1
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X