»   » అగ్రహీరోతో ఐటెం సాంగ్‌కు అనుష్క రెడీ.. కళ్లు చెదిరే రెమ్యునరేషన్..

అగ్రహీరోతో ఐటెం సాంగ్‌కు అనుష్క రెడీ.. కళ్లు చెదిరే రెమ్యునరేషన్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి సినిమాతో బ్రహ్మండమైన పేరు ప్రతిష్టలు వచ్చిన అనుష్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. దేశవ్యాప్తంగా దేవసేన పాత్రకు ప్రేక్షకులు నీరాజనం పట్టిన అవకాశాలు రాకపోవడంతో అనుష్కను కుంగదీస్తుందట. అయితే సినిమాలకు దూరమైతే అందరూ మరిచిపోతారనే ఉద్దేశంతో అనుష్క ఐటెం సాంగ్‌ చేయడానికి సిద్ధమైనట్టు ఫిలింనగర్‌లో ఓ రూమర్ ప్రచారం జరుగుతున్నది. అయితే ఆ వార్త నిజమా లేదా తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇంతకీ అనుష్క చేస్తున్న ఐటెం సాంగ్ ఏ చిత్రంలో? హీరో ఎవరూ అనే విషయాలు ఇవిగో..

భరత్ అను నేనులో ఐటెం సాంగ్

భరత్ అను నేనులో ఐటెం సాంగ్

ప్రిన్స్ మహేశ్‌బాబు, దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న స్పైడర్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగానే మరో వైపు దర్శకుడు కొరటాల శివ సినిమాను పట్టాలెక్కించాడు. భరత్ అనే నేను అనే సినిమాకు ప్రిన్స్ రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో కథ డిమాండ్ మేరకు ఐటెం సాంగ్ ఒకటి ఉందట. ఈ పాటలో నటించాలని అనుష్కను నిర్మాతలు సంప్రదించినట్టు సమాచారం.

Anushka Shetty New Movies Details | Tollywood | Telugu Filmibeat
ఖలేజా తర్వాత మళ్లీ ప్రిన్స్‌తో..

ఖలేజా తర్వాత మళ్లీ ప్రిన్స్‌తో..

ప్రిన్స్ మహేశ్ పక్కన గతంలో దర్శకుడు త్రివిక్రమ్ రూపొందించిన ఖలేజాలో అనుష్క నటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తర్వాత మళ్లీ ప్రిన్స్‌తో అనుష్క నటించలేదు. అయితే తాజాగా భరత్ అనే నేను సినిమాలో ఓ ప్రత్యేక పాటలో నటించే అవకాశం రావడంతో సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తున్నది.

భారీ రెమ్యునరేషన్‌కు డిమాండ్

భారీ రెమ్యునరేషన్‌కు డిమాండ్

అయితే మహేశ్ సినిమాలో నటించేందుకు సిద్ధమైన అనుష్క భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఐటెం సాంగ్ కోసం రూ.3.5 కోట్లు డిమాండ్ చేశారన్నది ఫిలింనగర్ సమాచారం. అనుష్కకు ఆ మొత్తాన్ని ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది.

నయనతార బాటలో అనుష్క

నయనతార బాటలో అనుష్క

అనుష్క ఐటెం పాటల్లో నటించడానికి ముందుకు రావడాన్ని బట్టి చూస్తే ఆమె నయనతార బాటను ఎంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇటీవల ఓ చిత్రంలో అతిథి పాత్ర కోసం రూ.2 కోట్లకు పైగా తీసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొనే విధంగా అనుష్క ముందుకెళ్తున్నట్టు తెలుస్తున్నది

 చేజారిన సాహో కల...

చేజారిన సాహో కల...

ఇదిలా ఉండగా, బాహుబలి చిత్రం అనుష్కకు కలిసి వచ్చినట్టు కనిపించడం లేదు. బాహుబలి తర్వాత సాహో చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ అవకాశం వచ్చినట్టు వచ్చి చేజారింది. బాగా లావెక్కిందనే కారణంతో అనుష్కను సాహో నిర్మాతలు పక్కన పెట్టినట్టు వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.

English summary
Anushka has decided to play an item number in the upcoming Mahesh babu film. Reports suggest that She is ready for a dance number in Mahesh Babu's next Bharath Ane Nenu. Still, it is unclear an official announcement is awaited. Anushka has demanded Rs 3.5 crore as remuneration for an item song.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu