»   » అనుష్క కొత్త చిత్రం 'సైజ్ జీరో' ప్రారంభం

అనుష్క కొత్త చిత్రం 'సైజ్ జీరో' ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరసగా భారీ చిత్రాలు చేస్తున్న అనుష్క మరో చిత్రం కమిటైంది. 'సైజ్ జీరో' టైటిల్ తో రూపొందే ఈ చిత్రం ఈ రోజే ప్రారంభం అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ పివిపి సినిమాస్ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించబోయే భారి బడ్జెట్ సినిమా నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

దర్శ కేంద్రుడు కె.రాఘవేంద్రరావు తనయుడు, ‘అనగనగా ధీరుడు' సినిమా దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారు. యం.యం.కీరవాణి సంగీత దర్శకుడు. ప్రసాద్ వి పోట్లురి నిర్మాత. ‘బాహుబలి', ‘రుద్రమదేవి' సినిమాల తర్వాత అనుష్క నటిస్తున్న మరో భారి బడ్జెట్ ఫాంటసీ సినిమా ఇది .

యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కథ, కథనాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని సమాచారం. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. కోవెలమూడి ప్రకాష్ భార్య ఈ నవలను రాసినట్లు తెలుస్తోంది.

Anushka Shetty's Size Zero Launched

అనుష్క ఓ బాలీవుడ్‌ సినిమాను అంగీకరించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 'అమన్‌ కి ఆశ' చిత్రాన్ని రూపొందించిన ఇ.నివాస్‌ తన తదుపరి చిత్రంలో అనుష్కను బాలీవుడ్‌కు పరిచయం చేసే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

''నేను అనుష్కకు ఓ కథ వినిపించాను. ఆమెకు చాలా బాగా నచ్చింది. ఏదైనా అనుష్క నుంచి ఓకే అనే మాట వచ్చాకే చెప్పగలను. ఈ కథకు అనుష్క వందశాతం సరిపోతుందని ఆమెను సంప్రదించాను. ఈ నెలాఖరుకు ఈ ప్రాజెక్టు ఓ కొలిక్కి రావచ్చు''అని చెప్పారాయన.

సినిమా గురించి చెబుతూ ''ఈ చిత్రానికి 'జువీనల్‌' అనే పేరు ఖరారు చేశాం. మల్టీస్టారర్‌ చిత్రం. మహిళా ప్రాధాన్య చిత్రం కాదు. భిన్న కథల సమ్మేళనంగా సాగుతుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా చిత్రీకరణ మొదలుకానుంది''అని చెప్పారు నివాస్‌. అనుష్క ప్రస్తుతం 'బాహుబలి' చిత్రీకరణలో బిజీగా ఉంది.

English summary
Anushka Shetty has yet again signed a women centric film. The film had it's formal launch on Monday morning and it is said to be titled as Size Zero. Prakash Kovelamudi, son of the legendary director, K Raghavendra Rao, is directing the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu