»   » కృష్ణమ్మగా... అనుష్క స్పెషల్ డాన్స్ సూపర్బ్ (ఫోటోస్)

కృష్ణమ్మగా... అనుష్క స్పెషల్ డాన్స్ సూపర్బ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అదో గొప్ప భక్తిరస చిత్రం కాబోతోంది అనేది ప్రజల్లో నమ్మకం. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి లాంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం.

తాజాగా కె. రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న ''ఓం నమో వేంకటేశాయ'' సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుడు హథీరామ్‌ బాబా జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా నాగార్జున మెయిన్ రోల్ చేస్తున్నారు.


ఈ సినిమాలో అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క ట్రెడిషనల్ డాన్స్ తో ప్రేక్షకులను అలరించబోతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను రాఘవేంద్రరావు రిలీజ్ చేసారు.


అనుష్క

అనుష్క

అనుష్క తన కెరీర్లోనే పూర్తి భిన్నమైన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో గతంలో ప్రేక్షకులు ఎప్పుడూ చూడని కొత్త అనుష్కను చూడబోతున్నాం.


నాగ్-అనుష్క

నాగ్-అనుష్క

గతంలో నాగార్జున, అనుష్క కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చినా అవన్నీ గ్లామర్, రొమాన్స్ కలగలిపిన చిత్రాలే. ఈసారి ఇద్దరూ కలిసి భక్తి రస చిత్రంలో నటిస్తుండటం విశేషం.


ప్రాక్టీస్

ప్రాక్టీస్

అనుష్క ట్రెడిషనల్ డ్యాన్సును ఇతర నర్తకిలతో కలసి బాగా ప్రాక్టీస్ చేససారు. ఈ డాన్స్ నేర్చుకోవడానికి అనుష్క చాలా కష్టపడిందని, అనుష్క్ పార్టీ సినిమాలో హైలెట్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు.


నాగార్జున

నాగార్జున

గతంలో అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి పాత్రల్లో అలరించిన నాగార్జున ఈ సారి హథీరామ్‌ బాబాగా అదరగొట్టబోతున్నారు.


భక్తిరస చిత్రం

భక్తిరస చిత్రం

రాఘవేంద్రరావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన గత భక్తిరస చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూరుస్తున్నారు.


సౌరభ్

సౌరభ్

ఈ సినిమాలో శ్రీ వేంకటేశ్వర స్వామి పాత్రను పరిచయం చేస్తూ చిత్ర బృందం ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు, మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రను నటుడు సౌరభ పోషిస్తున్నారు.


English summary
South Indian actress Anushka Shetty's special dance performance on Om Namo Venkatesaya sets. Om Namo Venkatesaya is an upcoming Telugu devotional movie directed by K. Raghavendra Rao and produced by A. Mahesh Reddy under the AMR Sai Krupa Entertainments banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu