twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రుద్రమ దేవి' కోసం అనూష్క ప్రత్యేక శిక్షణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : ''కాకతీయుల చరిత్ర, 'రుద్రమ దేవి' కథ, పాత్రల గురించి దర్శకుడు గుణశేఖర్‌ చెబుతుంటే చాలా ఆసక్తిగా అనిపించింది. ఆయన స్క్రిప్ట్‌ మొత్తం చూపించారు. ఆ పాత్ర కోసం నేను నెలన్నర రోజులపాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నాను'' అని అనూష్క మీడియాకు తెలియచేసారు. గుర్రం స్వారీ,కత్తి తిప్పటం, హుందాగా నడవటం, ప్రత్యేకమైన మాడ్యూలేషన్ వంటివి ఈ శిక్షణలో ఉండనున్నాయని సమాచారం.

    మరో ప్రక్క దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రం కోసం లొకేషన్స్ ఎంపిక,ఫోటో షూట్ వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. అనూష్క,గుణశేఖర్ కాంబినేషన్ లో 'రుద్రమదేవి' అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ త్రీడీ చిత్రం వరంగల్ లో లొకేషన్స్ చూసుకు వచ్చింది. వరంగల్‌ పేరు చెప్పగానే వేయి స్తంభాల గుడితో పాటు రాణీ రుద్రమదేవి కూడా గుర్తొస్తుంది. 13వ శతాబ్దపు కాకతీయుల వైభవాన్ని చరిత్ర పాఠాల్లో కథలు కథలుగా చెప్పుకొన్నాం. రుద్రమదేవి సాహస గాథ విని స్ఫూర్తి తెచ్చుకొన్నాం. అవన్నీ మా సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

    గుణశేఖర్‌ మాట్లాడుతూ ''వరంగల్‌లోని చారిత్రక కట్టడాల గురించి చరిత్రకారులతో ప్రత్యేకంగా మాట్లాడాను. అవన్నీ మా పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలకు తగినట్టుగా సెట్స్‌ నిర్మిస్తున్నాం. కళాదర్శకుడు తోట తరణి.. ఇందుకు సంబంధించిన స్కెచ్‌లు వేస్తున్నారు''అని చెప్పారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

    అలాగే "జర్మనీలో 3డి టెస్ట్ షూట్‌ను వారం రోజుల పాటు సక్సెస్‌ఫుల్‌గా జరిపాం. మా కళా దర్శకుడు తోట తరణితో కలిసి ఓరుగల్లు కోట, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి వంటి చారిత్రక కట్టడాలను సందర్శించాం. వాటి గురించి కొంతమంది చరిత్రకారులతో చర్చలు జరిపాం. వాస్తవికత ఉట్టిపడేలా ఆ కట్టడాలను సెట్స్ రూపంలో తరణి నిర్మిస్తున్నారు. 13వ శతాబ్దపు కాకతీయ వైభవాన్ని 'రుద్రమదేవి'లో తెరపై చూపించే ప్రయత్నం చేస్తున్నాం'' అని చెప్పారు.

    గుణా టీమ్ వర్క్స్ పతాకంపై స్వీయ నిర్మాణంలో గుణశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందించ బోతున్నారు. భారతదేశపు తొలి చారిత్రక స్టీరియోస్కోపిక్ 3డి చిత్రంగా తయారవుతున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే 3డి టెస్ట్ షూట్‌ను జర్మనీలో జరిపిన బృందం ప్రస్తుతం ఓరుగల్లులో చారిత్రక కట్టడాలను పరిశీలిస్తోంది ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, ఛాయాగ్రహణం: అజయ్ విన్సెంట్, కూర్పు: శ్రీకరప్రసాద్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాణం, దర్శకత్వం: గుణశేఖర్.

    English summary
    Anushka transforming in the role ‘Rudrama Devi’. Anushka is going to a special training to play the role of ‘Rudrama Devi’ in her upcoming film.This film will be directed and produced by Gunasekhar under Guna Team Works banner.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X