»   » తెలంగాణ వల్ల 220 సినిమాలు ఆగిపోయాయట!

తెలంగాణ వల్ల 220 సినిమాలు ఆగిపోయాయట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాష్ట్ర విభజన పరిణామాల నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమకు తీవ్రమైన నష్టం కలిగిందని, దాదాపు 220 సనిమాలు అర్ధాంతరంగా ఆగిపోయాయని అంటున్నారు నిర్మాత, తెలుగుదేశం పార్టీ నాయకుడైన అంబికా కృష్ణ. బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

చిన్న సినిమాలు ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, విభజనతో ఆ ఇబ్బందులు మరింత తీవ్రమయ్యాయని అన్నారు. రెండు రాష్టాల ఏర్పాటు వల్ల మున్ముందు సినిమాల విడుదల విషయంలో అనేక సమస్యలు ఏర్పడుతాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.

 Ambika Krishna

కాగా....ఇటీవల పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లుయింది. ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్‌ మాత్రమే కీలక పాత్ర పోషించేది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తయి నేపథ్యంలో ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కూడా తన కార్యకలాపాలు విస్తరించేందుకు ప్లాన్ చేసుకుంటోంది.

ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ చాంబర్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ మధ్య చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా ఉండనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో గుత్తాధిపత్యం సాగిస్తున్న కొందరు పెద్ద నిర్మాతలు రాష్ట్ర విభజన నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో తమ పట్టునుకోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు.

English summary
Producer Ambika Krishna says, Andhra Pradesh bifurcation suffers many industries now and one of the big industry is Films. This is burning now with huge losses says couple of Film Producers and biggies in the industry. About 220 films stopped in the middle and it affects the small producers and artists.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu