»   » ఎన్టీఆర్ సినీకార్మిక సంఘం ఏర్పాటు, బాలయ్య హ్యాపీ

ఎన్టీఆర్ సినీకార్మిక సంఘం ఏర్పాటు, బాలయ్య హ్యాపీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఎంప్లాయీస్ యూనియన్ నూతన భవనాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసారు. ఈ భవనానికి 'ఎన్టీఆర్ సినీకార్మిక సంఘం'గా నామకరణం చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకరత్న దాసరి నారాయణరావు, మూవీ మొఘల్ డి రామానాయుడు, ప్రముఖ నటి జమున, నందమూరి హీరో బాలకృష్ణ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ...ఏ రంగానికైనా కార్మికులే ఆయువు పట్టు, బలం, పునాది అని వ్యాఖ్యానించారు. మహా నటుడు, మా నాన్నగారు ఎన్టీఆర్ పేరు పెట్టడం ఎంతో సంతోషంగా ఉందని, ఆయన డ్రైవర్ స్థాయి నుంచి ఏ స్థాయి వారికైనా ఒకే రకమైన గౌరవం, మర్యాద ఇచ్చేవారని గుర్తు చేసుకున్నారు.

సినీ కార్మికులకు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని బాలకృష్ణ భరోసా ఇచ్చారు. నాన్న గారి పట్ల అభిమానంతో ఆయన పేరు పెట్టింనందుకు సినీ కార్మికులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖ నిర్మాత డి రామానాయుడు భవన నిర్మాణానికి తన వంతు విరాళంగా రూ. 1 లక్ష అందిస్తున్నట్లు ప్రకటించారు.

ఎన్టీఆర్ సినీ కార్మిక భవన్

ఎన్టీఆర్ సినీ కార్మిక భవన్


ఎన్టీఆర్ సినీ కార్మిక భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న దాసరి నారాయణరావు, బాలకృష్ణ, రామానాయుడు, జమున, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు

బాలకృష్ణ

బాలకృష్ణ


ఎన్టీఆర్ సినీ కార్మిక భవన్ ప్రారంభోత్సవంలో శిలాపలకాల్ని ఆవిష్కరిస్తున్న బాలకృష్ణ

దాసరి నారాయణరావు

దాసరి నారాయణరావు


ఎన్టీఆర్ సినీ కార్మిక భవన్ రిబ్బన్ కటింగ్ కార్యక్రమంలో దాసరి నారాయణరావు, జమున

బాలయ్య, దాసరి

బాలయ్య, దాసరి


ఎన్టీఆర్ సినీ కార్మిక భవన్ రిబ్బన్ కటింగ్ కార్యక్రమంలో దాసరి నారాయణరావు, బాలకృష్ణ

నూతన భవనం

నూతన భవనం


సినిమా రంగంలోని 24 విభాగాల్లో పని చేసే కార్మికులంతా కలిసి నూతన భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీనికి ఎన్టీఆర్ సినీ కార్మిక భవన్‌గా నామకరణం చేసారు.

English summary
AP Film Employment Federation new building inauguration held today at Hyderabad. Balakrishna, Dasari Narayana Rao, Jamuna, D Ramanaidu attended.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu