»   » లండన్‌లో ఎన్టీఆర్‌ను కలిసిన అనుకోని అతిథి (ఫోటోస్)

లండన్‌లో ఎన్టీఆర్‌ను కలిసిన అనుకోని అతిథి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సుకుమార్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్‌ లండన్‌లో జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'నాన్నకు ప్రేమతో...' అనే వర్కింగ్ టైటిల్ తో వ్యవరిస్తున్నారు. అయితే ఈ టైటిల్ కాకుండా "అభిరామ్" అనే టైటిల్ ని ఫిల్మ్ ఛాంబర్ లో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకం బ్యానర్ పై రిజిస్టర్ చేసారు. ఈ రెండింటిలో ఏది ఫైనల్ కానుందో చూడాలి.

ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 8,2016న విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ లోగా దసరా పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 22న టీజర్ ని విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే టైటిల్ లోగోను సెప్టెంబర్ 17న విడుదల చేయనున్నారు.

కాగా... లండన్‌ పర్యటనకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌ అక్కడ చిత్ర బృందాన్ని కలిశారు. ఎన్టీఆర్‌, చిత్ర బృందం సభ్యులు ఆయన్ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, చిత్రం యూనిట్‌ పాల్గొన్నారు.

ఎన్టీఆర్-కోడెల

ఎన్టీఆర్-కోడెల


ఎన్టీఆర్ ను కలిసిన కోడెల బృందం

అభిమానులు

అభిమానులు


లండన్ లోని పలువురు ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ను కలిసారు.

శాలువాతో సన్మానం

శాలువాతో సన్మానం


ఎన్టీఆర్‌, చిత్ర బృందం సభ్యులు ఆయన్ను శాలువాతో సన్మానించారు.

ఎన్టీఆర్

ఎన్టీఆర్


ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌ హీరోగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
Andhra Pradesh Assembly speaker Kodela Sivaprasad Rao and B.G.Reddy met NTR on the sets of 'Nannaku Prematho' in UK and spent quality time with the team.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu