Don't Miss!
- News
vastu tips: నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటున్నారా? అరిష్టం.. ఎందుకంటే!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
రజనీ ఆరోగ్య పరిస్థితిపై సందేహాలు.. పార్టీ ఏర్పాటుపై ప్రకటన మరింత ఆలస్యం? ఆందోళనలో ఫ్యాన్స్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరడం సంచలనం రేపింది. తన జీవితంలో వేసే కీలక అడుగు ముందు రజనీ హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ చేరారనే వార్త తమిళ రాజకీయాల్లో ప్రకంపలను రేపాయి. తాజాగా రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో వైద్య వర్గాలు రిలీజ్ చేసిన హెల్త్ బులెటిన్ మీకోసం..

రజనీ వేగంగా కోలుకొంటున్నారు.. కానీ
అపోలో ఆస్పత్రి యాజమాన్యం తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం. శుక్రవారం హాస్పిటల్ చేరిన రజనీకాంత్ వేగంగా కోలుకుంటున్నారు. గత రాత్రి కూడా ఆనారోగ్యంతో బాధపడ్డారు. బ్లడ్ ప్రెషర్ ఇంకా కంట్రోల్ కాలేదు. కాకపోతే నిన్నటి కంటే చాలా బెటర్‌గా కనిపించారు. నిన్న నిర్వహించిన పరీక్షల ఫలితాలు అందాయి. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదనే విషయాన్ని రిపోర్టులు స్పష్టం చేశాయి. శనివారం కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. వాటి రిపోర్టులు సాయంత్రానికి అందుతాయి అని తెలిపారు.

బీపీలో తీవ్రస్థాయి హెచ్చు తగ్గులు
రజనీకాంత్ బ్లడ్ ప్రెషర్ హెచ్చు తగ్గుల విషయాన్ని అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఆయన ప్రత్యేక డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. బీపీలో హెచ్చు తగ్గుల కారణంగా పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవాలని సూచించాం. ఆయనను కలువడానికి సందర్శకులను అనుమతించడం లేదు. శనివారం వచ్చే రిపోర్టుల ప్రకారమే రజనీకాంత్‌ను ఎప్పుడు రిలీజ్ చేసేది చెబుతాం అని అపోలో హాస్పిటల్స్ వర్గాలు తెలిపారు తెలిపింది.

డిసెంబర్ 31న ప్రకటనపై
ఇక డిసెంబర్ 31న రజనీకాంత్ తన పార్టీ ప్రకటనపై కీలక ప్రకటన చేయాలని భావించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అన్నాతే షూటింగులో పాల్గొంటూ అస్వస్థతకు గురయ్యారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయి విశ్రాంతి అవసరం ఉందని వైద్యులు వెల్లడించిన నేపథ్యంలో రాజకీయ ప్రకటన ఆలస్యం కావోచ్చనే మాట మీడియాలో బలంగా వినిపిస్తున్నది.

ప్రత్యర్థుల వ్యంగ్యాస్త్రాలు
రజనీ రాజకీయ ప్రవేశంపై వ్యంగ్యాస్త్రాలు విసురుతున్న ప్రత్యర్థులకు ప్రస్తుత రజనీ ఆరోగ్య పరిస్థితి మరింత కలిసి వస్తున్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నేతలు రజనీ రాజకీయాల్లోకి రావడం కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని తమిళనాడు వ్యాప్తంగా ప్రార్థనలు చేస్తున్నారు.