For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్‌కు స్టోరీ చెప్పా.. తెలుగులో సినిమా చేస్తున్నా: సౌతిండియా స్టార్ డైరెక్టర్ కామెంట్స్

  By Manoj Kumar P
  |

  జూనియర్ ఎన్టీఆర్.. ఈ పేరుకు అస్సలు పరిచయం అవసరం లేదు. ప్రముఖ సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మనవడిగా సినీ రంగంలోకి ప్రవేశించినా.. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. కెరీర్ ఆరంభంలోనే బంపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్న యంగ్ టైగర్.. మధ్యలో కొన్ని పరాజయాలను చవి చూశాడు.

   మూడు హిట్లు ఇచ్చిన దర్శకుడితో సినిమా

  మూడు హిట్లు ఇచ్చిన దర్శకుడితో సినిమా

  ప్రస్తుతం తారక్.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న RRRలో నటిస్తున్నాడు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ‘స్టూడెంట్ నెం 1', ‘సింహాద్రి', ‘యమదొంగ' వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో జూనియర్.. కొమరం భీంగా కనిపించబోతున్నాడు.

  తారక్ తర్వాతి సినిమా ఎవరితో.?

  తారక్ తర్వాతి సినిమా ఎవరితో.?

  కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తారక్ తర్వాతి సినిమా ఎవరితో అన్న చర్చ జరుగుతోంది. RRR వచ్చే ఏడాది ప్రథమార్ధంలో పూర్తవుతుంది. దాని తర్వాత జూనియర్ ఎవరి దర్శకత్వంలో సినిమా చేస్తాడన్న విషయంలో క్లారిటీ రావడం లేదు. కానీ, ఎంతో మంది దర్శకుల పేర్లు మాత్రం తెరపైకి వస్తున్నాయి. ఇందులో పక్క ఇండస్ట్రీల వాళ్లు కూడా ఉన్నారు.

  ముఖ్యంగా ఆ ముగ్గురి పేర్లు

  ముఖ్యంగా ఆ ముగ్గురి పేర్లు

  జూనియర్ ఎన్టీఆర్.. తన తదుపరి చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీతో చేయబోతున్నాడని జోరుగా ప్రచారం జరిగింది. అలాగే, ‘కేజీఎఫ్' ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ అతడు నటించబోతున్నాడని అన్నారు. ఇక, తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనూ ఆయన సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ, ఎవరితోనూ ఫైనలైజ్ కాలేదు.

  ఎన్టీఆర్‌కు స్టోరీ చెప్పానన్న స్టార్ డైరెక్టర్

  ఎన్టీఆర్‌కు స్టోరీ చెప్పానన్న స్టార్ డైరెక్టర్

  సౌత్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు ఏఆర్ మురుగదాస్. ఈయన ప్రస్తుతం రజినీకాంత్‌తో ‘దర్బార్' అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్‌లో ఎన్టీఆర్‌తో మూవీ గురించి మాట్లాడారు. ‘నేను గతంలో తారక్‌కు ఓ కథ చెప్పా. అది జరిగి చాలా కాలం అయింది. అయితే, నా తర్వాతి చిత్రం ఆయనతో మాత్రం కాదు. కానీ, త్వరలోనే తెలుగు హీరోతో సినిమా చేస్తా' అని చెప్పుకొచ్చారు.

  గతంలో చిరంజీవి, మహేశ్‌తో సినిమాలు

  గతంలో చిరంజీవి, మహేశ్‌తో సినిమాలు

  మురుగదాస్ గతంలో రెండు తెలుగు సినిమాలను తెరకెక్కించాడు. మెగాస్టార్ చిరంజీవి - త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ‘స్టాలిన్'తో పాటు.. ఇటీవల మహేశ్ నటించిన ‘స్పైడర్'ను ఆయన తీశారు. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలతో పాటు తెలుగులో సినిమా చేస్తా అనడంతో.. త్వరలోనే వీళ్లిద్దరి కాంబోలో సినిమా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  Murugadoss Arunasalam, commonly known by his stage name AR Murugadoss is an Indian film director, producer, and screenwriter who predominantly works in the Tamil Film Industry. He is best known for his action Tamil films and Telugu films and for remaking them in Hindi cinema.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X