»   » పవన్ కళ్యాణ్ కొడుకు పేరుతో సినిమా!

పవన్ కళ్యాణ్ కొడుకు పేరుతో సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా పేరుతో ఓ సినిమా రాబోతోంది. ఏంటి అప్పుడే పవన్ కళ్యాణ్ తనయుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడమని అనుకుంటున్నారా? అలాంటి దేమీ లేదండీ. అసలు ‘అకీరా' సినిమాకు, పవన్ తనయుడు అకీరా నందన్‌కు ఎలాంటి సంబంధం లేదు.

ప్రముఖ తమిళ దర్శకుడు, 'గజిని' ఫేం మురుగదాస్ ప్రస్తుతం ఓ హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. సోనాక్షీ కథానాయికగా నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ఇది. ఈ చిత్రానికి 'అకీరా' అని పేరు పెట్టాడు మురుగదాస్. అఖీరా అంటే.. 'గ్రేస్ ఫుల్ స్ర్టెంత్' అని అర్థం. మురుగదాస్ ఈ టైటిల్ పెట్టింది పవన్ కళ్యాన్ కొడుకుని దృష్టిలో ఉంచుకుని ఏమాత్రం కాదు. అఖీరా కురసోవా అనే ప్రపంచ ప్రఖ్యాత జపనీస్ దర్శకుడిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ సినిమాకు టైటిల్ పెట్టి ఉంటాడని అంటున్నారు.

AR Murugadoss' next starring Sonakshi Sinha titled 'Akira'

ఈ సినిమాలో సోనాక్షి ఫాదర్ కూడా నటిస్తున్నారు. ఆయన చేస్తున్న పాత్ర చిన్నదే అయినా సినిమాకు ఎంతో ముఖ్యమైన పాత్ర' అని ఆ చిత్రానికి సంబంధించిన యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియో నిర్మిస్తోంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘మౌనగురు' చిత్రానికి ఇది రీమేక్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
Film source said that, A.R. Murugadoss’ next starring Sonakshi Sinha titled ‘Akira’.
Please Wait while comments are loading...