»   » బాహుబలి 2000 కోట్లను దాటేస్తుంది.. దక్షిణాదివారు వరద గేట్లు ఎత్తేశారు.. ఏఆర్ రెహ్మాన్

బాహుబలి 2000 కోట్లను దాటేస్తుంది.. దక్షిణాదివారు వరద గేట్లు ఎత్తేశారు.. ఏఆర్ రెహ్మాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న బాహుబలి2 సినిమాపై అన్నివర్గాల వారు ప్రశంసల జల్లు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రముఖులంతా సోషల్ మీడియాలో గానీ లేదా మీడియాలో గానీ తమ స్పందనను తెలియచేస్తున్నారు. తాజాగా సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ తాజా ఫేస్‌బుక్‌లో బాహుబలి చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాహుబలి సినిమా సంచలనం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

బాహుబలిని చూశాను..

బాహుబలిని చూశాను..

దర్శకుడు రాజమౌళి గారికి, సంగీత దర్శకుడు కీరవాణిగారికి, బాహుబలి2 చిత్ర యూనిట్‌కు.. నేనిప్పుడే చెన్నైలో సినిమాను చూశాను. బాక్సాఫీస్ వద్ద బాహుబలి సినిమా రూ.2000 కోట్ల మైలురాయిని దాటుతుందనే ఆశాభావంతో ఉన్నాను. ఇంకా ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. మీరంతా ప్రపంచం వైపు దక్షిణ భారత సినిమా గేట్లు ఎత్తేశారు అని రెహ్మాన్ కామెంట్ చేశారు.


వీఆర్ టెక్నాలజీతో దర్శకుడిగా..

వీఆర్ టెక్నాలజీతో దర్శకుడిగా..

సంగీత దర్శకుడిగా ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొన్న ఏఆర్ రెహ్మాన్ ఇటీవల దర్శకుడిగా మారారు. వర్చువల్ రియాల్టీ టెక్నాలజీతో హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరో సంగీత, నృత్య ప్రధానమైన చిత్రానికి దర్శకత్వం వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇటీవల మాట్లాడుతూ.. మ్యూజిక్ ద్వారా కొన్ని కథలను చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాను. వర్చువల్ రియాల్టీ సాంకేతికత నాకు మార్గం చూపింది అని ఏఆర్ రెహ్మాన్ చెప్పారు.


అంత బడ్జెట్ నా వద్ద లేదు..

అంత బడ్జెట్ నా వద్ద లేదు..

బాహుబలి లాంటి చిత్రాన్ని నిర్మించే ఉద్దేశం ఏమైనా ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. 200 కోట్లు ఖర్చు పెట్టి తీసేంత బడ్జెట్ నా వద్ద లేదు. ఇప్పటికిప్పుడు అలాంటి ఆలోచనలు లేవు. సినిమా పరిశ్రమలో 25 ఏళ్లు పనిచేసినా నా వద్ద అంత డబ్బులేదు అని రెహ్మాన్ అన్నారు.


25 ఏళ్ల రెహ్మాన్..

25 ఏళ్ల రెహ్మాన్..

సినీ పరిశ్రమలోకి రెహ్మాన్ ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. మణిరత్నం దర్శకత్వంలో 1992లో వచ్చిన రోజా చిత్రానికి ఆయన సంగీతాన్ని అందించారు. ఇటీవల 25 ఏళ్ల సిని జీవితానికి సంబంధించిన విషయాలను నెమరువేసుకొన్నారు. సంగీత దర్శకుడిగానే కాకుండా దర్శకుడిగా చిత్ర పరిశ్రమకు మరిన్ని సేవలు అందించడానికి ప్రయత్నిస్తున్నారు.English summary
Baahubali 2: The Conclusion’ has been garnering praises from all corners. Be it actors, filmmakers or the general movie goer, no one can stop raving about SS Rajamouli’s magnum opus. A.R. Rahman is the latest to join the long list of celebrities who have publicly applauded the film’s success.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu