Just In
- 4 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 5 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 5 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 5 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
కూరగాయాలకు మద్దతు ధర, సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..?
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆస్కార్ రేసు నుండి ఏఆర్ రెహమాన్ ఔట్
ముంబై: తొలి ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న భారతీయ మ్యూజిక్ డైరెక్టరుగా చరిత్ర సృష్టించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 87వ ఆస్కార్ అవార్డుల్లో మరోసారి సత్తా చాటాలని ప్రయత్నించాడు. 2014లో ఆయన సంగీత సారథ్యం వహించిన మిలియన్ డాలర్ ఆర్మ్, హండ్రడ్ ఫుట్ జర్నీ, కొచ్చాడియాన్ సినిమాలు బెస్ట్ ఓరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ బరిలో పోటీ పడ్డాయి. అయితే ఫైనల్ నామినేషన్స్‌లో ఈ చిత్రాలకు చోటు దక్కలేదు. దీంతో ఈ సారి ఆయనకు అవార్డు దక్కే అవకాశం లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఫిబ్రవిర 22న ఈ అవార్డుల ప్రధానోత్సవం జరుగనుంది. గతంలో ‘స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి రెహమాన్ ఆస్కార్ అవార్డు అందుకున్స సంగతి తెలిసిందే.

ఈ అవార్డుల సంగతి పక్కన పెడితే త్వరలో రెహమాన్ సరికొత్త అవతారం ఎత్తబోతున్నారు. స్క్రిప్టు రైటర్‌గా తన టాలెంట్ ప్రదర్శించబోతున్నారు. ఈ విషయం స్వయంగా ఏఆర్ రెహమాన్ వెల్లడించడం గమనార్హం. ముంబైలో జరిగిన హిందీ వెర్షన్ ‘ఐ' ఆడియో వేడుకలో రెహమాన్ ఈ విషయం వెల్లడించారు.
తన రాసిన స్క్రిప్టు అందించిన సినిమాలో ఆయన నిర్మాతగా నటించబోతున్నారు కూడా. త్వరలోనే ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి. 2014 సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకమైన సంవత్సరమని, ఈ సంవత్సరం మొత్తం 14 చిత్రాలకు సంగీతం అందించాను. అందులో మూడు హాలీవుడ్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయని తెలిపారు.