twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనిపించేది: ఏఆర్ రెహమాన్

    |

    ఏఆర్ రెహమాన్... ఈ పేరు తెలియని సంగీత అభిమాని దాదాపు ఉండరు. ఆస్కార్ అవార్డు సైతం సొంతం చేసుకుని కేవలం భారత దేశానికే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలో పాపులర్ అవ్వడంతో పాటు అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

    రెహమాన్ ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఎన్నో కఠినమైన పరిస్థితులను సైతం ఆయన ఎదుర్కొన్నారు. ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన ఆయన మనసులో ప్రతిరోజూ మెదిలేదట. ఇలా రెహమాన్ జీవితానికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ బయోగ్రఫీ విడుదలైంది.

    ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను

    ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను

    నాకు 25 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి రోజూ నా మదిలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన మెదిలేది. మా నాన్న మరణం తర్వాత అంతా శూన్యం అనిపించింది. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలిగేది అని రెహమాన్ బయోగ్రఫీలో చెప్పుకొచ్చారు.

    ఆ పరిణామాలే నన్ను భయం లేనివాడిగా మార్చాయి

    ఆ పరిణామాలే నన్ను భయం లేనివాడిగా మార్చాయి

    అయితే నాన్న మరణం తర్వాత కొన్ని పరిణామాలు నన్ను భయం లేనివాడిగా మార్చాయి. ప్రతి మనిషికి చావు వస్తుంది. అయితే ఆలోపే మనం చేయాలనుకున్నవి చేయాలి. అలాంటపుడు మనం దేనికైనా ఎందుకు భయపడాలి? అనే ఆలోచన నాలో పెరిగింది అని రెహమాన్ అన్నారు.

    ఏఆర్ రెహమాన్ బయోగ్రఫీ

    ఏఆర్ రెహమాన్ బయోగ్రఫీ

    ‘నోట్స్ ఆఫ్ ఎ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఏఆర్ రెహమాన్' బుక్ లాంచ్ ఈవెంట్ శనివారం జరిగింది. కృష్ణ త్రిలోక్ ఈ బయోగ్రఫీ రాశారు. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

    సంగీత వాయిద్యాలు అద్దెకిస్తూ...

    సంగీత వాయిద్యాలు అద్దెకిస్తూ...

    రెహమాన్ తండ్రి ఆర్‌కె శేఖర్ ఫిల్మ్ స్కోర్ కంపోజర్. రెహమాన్ 9 ఏళ్ల వయసులో ఆయన మరణించారు. ఆ తర్వాత వారి కుటుంబం కొంతకాలం పాటు తమ వద్ద ఉన్న సంగీత వాయిద్యాలు అద్దెకిస్తూ జీవనం సాగించింది. ఇంట్లోనే సంగీత వాయిద్యాలు ఉండటంతో వాటిని వాయించడంలో రెహమాన్ ఆరితేరాడు.

    మతం మారారు

    మతం మారారు

    మణిరత్నం ‘రోజా' సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే రెహమాన్ కుటుంబం సూఫీ ఇస్లాం స్వీకరించారు. అంతకు ముందు రెహమాన్ పేరు దిలీప్ కుమార్. ఇలా రెహమాన్ జీవితానికి సంబంధించి చాలా విషయాలు ఈ బయోగ్రఫీలో ఉన్నాయి.

    English summary
    Before the country recognised the talent of AR Rahman, the celebrated composer says there was a phase in his life where he felt like a failure and thought about ending his life almost every day. The Oscar-winning composer says the initial low phase of his career eventually helped him emerge braver than before."Up until 25, I used to think about suicide. Most of us feel they are not good enough. Because I lost my father, there was this void... There were so many things happening."(But) that in a way made me more fearless. Death is a permanent thing for everyone. Since everything created has an expiry date, so why be afraid of anything?" Rahman told PTI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X