»   » సాయిరాం శంకర్ ‘అరకు రొోడ్ లో’ ఆడియో లాంచ్

సాయిరాం శంకర్ ‘అరకు రొోడ్ లో’ ఆడియో లాంచ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

సాయిరాం శంక‌ర్‌, నికిషా ప‌టేల్ జంట‌గా శేషాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న చిత్రం అర‌కు రోడ్ లో. వాసుదేవ్ తెర‌కెక్కించారు. మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా సంయుక్తంగా నిర్మించారు. రాహుల్ రాజ్, వాసుదేవ్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌ల‌ను సోమ‌వారం హైద‌రాబాద్‌లోని జె.ఆర్‌.సి. క‌న్వెన్ష‌న్‌లో విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పూరి జ‌గ‌న్నాథ్‌, క‌ల్యాణ్ రామ్‌, సాయిరాం శంక‌ర్‌, నికిషా పటేల్, పూరి జగన్నాథ్ శ్రీమతి లావణ్య, ఆకాష్ పూరి, చిత్ర ద‌ర్శ‌కుడు వాసుదేవ్‌, చిత్ర నిర్మాత‌లు మేకా బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, బి.భాస్క‌ర్‌, వేగిరాజు ప్ర‌సాద రాజు, రామేశ్వ‌రి న‌క్కా, కమల్ కామరాజు, సినిమాటోగ్రాఫ‌ర్ జ‌గ‌దీష్ చీక‌టి, తమ్మలపల్లి రామసత్యనారాయణ, ఆర్యన్ రాజేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను క‌ల్యాణ్‌రామ్ విడుద‌ల చేశారు. బిగ్ సీడీని పూరి జ‌గ‌న్నాథ్, క‌ల్యాణ్ రామ్ విడుద‌ల చేశారు. ఆడియో సీడీల‌ను పూరి జ‌గ‌న్నాథ్ విడుద‌ల చేసి తొలి సీడీని క‌ల్యాణ్ రామ్ కు అందించారు.

English summary
Hero Sairam Shankar & Heroine Nikesha Patel starring Araku Road Lo Movie music launched.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu