»   » శివాజీ రావ్ గైక్వాడ్: "కాలా" పేర్ల వెనుక రహస్యమేమిటి? "భీమ్ జీ" ఎవరో తెలిస్తే ఆశ్చర్యమే

శివాజీ రావ్ గైక్వాడ్: "కాలా" పేర్ల వెనుక రహస్యమేమిటి? "భీమ్ జీ" ఎవరో తెలిస్తే ఆశ్చర్యమే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ సినిమాలో అరవింద్ అనే తమిళ నటుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. ఆయన పాత్రకి శివాజీరావు గైక్వాడ్ అనే పేరు పెట్టారట. ఇది రజనీకాంత్ అసలు పేరనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఎక్కడా తన స్వంత పేరుని వడని రజినీ ఈసారి ఒప్పుకోవటం, అదీ తన పేరుని తనకు కాకుండా అదే సినిమాలో చేస్తున్న మరో నటుడికి పెట్టటానికి అంగీకరించటం ఆసక్తి కరంగా మారింది.

రజనీకాంత్‌

రజనీకాంత్‌

సాధారణ కండక్టర్‌ స్థాయి నుంచి కోట్ల మంది అభిమానుల వెండితెర ఇలవేల్పుగా మారిన రజనీకాంత్‌ జీవితంలో ఎన్నో మలుపులు. ప్రతీ మలుపులోనూ ఆయనతో ఎందరో సెలబ్రేటీలు. కోటి ఆశలతో కోలీవుడ్‌కు వచ్చిన శివాజీరావ్‌ గైక్వాడ్‌ తను ఇక్కడుండటం వృథా అనే అభిప్రాయానికొచ్చారట.

 కె.బాలచందర్‌

కె.బాలచందర్‌

పెట్టె బేడా సర్దుకుని బెంగళూరు వెళ్లేందుకు చెన్నై రైల్వేస్టేషన్‌కు వెళ్లారు. అదే సమయంలో 'అపూర్వ రాగంగల్‌' చిత్రంలో శివాజీరావ్‌ను ఎంపిక చేసిన కె.బాలచందర్‌... ఆయన గది వద్దకు మనిషిని పంపారు. ఆ మనిషి గదికి వెళ్లి అక్కడ లేక అక్కడా ఇక్కడా వెతికి చివరకు రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు.

అపూర్వ రాగంగల్‌

అపూర్వ రాగంగల్‌

అలా 'అపూర్వ రాగంగల్‌' అవకాశమొచ్చి శివాజీరావు గైక్వాడ్‌ కాస్తా రజనీకాంత్‌గా... తర్వాత సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. అయితే ఇప్పటి వరకూ శంకర్ తీసిన శివాజీ లో తప్ప మరెకడా రజినీ పేరు ని శివాజీ గా గానీ, పూర్తిగా గా గానీ సొంత పేరుని వాడుకోలేదు. కానీ ఇప్పుడు రజినీ సొంత పేరు అదీ ఇంటిపేరు కలిపి మరీ పూర్తిపేరు ని ఉపయోగిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ అప్డేట్

ఇంట్రెస్టింగ్ అప్డేట్

కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర కథ.. ముంబై గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో సాగనుంది.ఈ సినిమాకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. అక్కడ షూటింగ్ పూర్తయిన తరువాత ఈ సినిమా టీమ్ చెన్నై కి షిఫ్ట్ కానుంది. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్లో మేజర్ పార్ట్ షూటింగ్ జరపనున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది.

శివాజీరావు గైక్వాడ్

శివాజీరావు గైక్వాడ్

కాలా కరికాలన్ మూవీలో తమిళ్ యాక్టర్ అరవింద్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈయన ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. ఇతని కేరక్టర్ కు పెట్టిన పేరు ఆసక్తి కలిగిస్తోంది. రజినీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్ ను.. అరవింద్ కేరక్టర్ కు పెడుతున్నారని కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

 భీమ్ జీ అనే పేరు

భీమ్ జీ అనే పేరు

ఇప్పటివరకూ రజినీ అసలు పేరు నుంచి కొంత భాగం తీసుకుని.. శివాజీ అంటూ శంకర్ సినిమాలో మాత్రమే ఉపయోగించారు. అలాగే కాలా చిత్రంలో మరో పాత్ర కూడా ఆసక్తి కలిగిస్తోంది. పొలిటికల్ లీడర్ రోల్ లో కనిపిస్తున్న నానా పటేకర్ కు భీమ్ జీ అనే పేరు పెడుతున్నట్లు తెలుస్తోంది.

రంజిత్ కు ట్విట్టర్ ఖాతా పేరు

రంజిత్ కు ట్విట్టర్ ఖాతా పేరు

పా రంజిత్ కు ట్విట్టర్ ఖాతా పేరు భీమ్ జీ కావడమే అసలైన విశేషం. ఈ విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి రజనీ అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. రజనీ సినిమాలో ఆయన పేరుతో మరో నటుడు కనిపించనుండటం పట్ల వాళ్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత్రను ఎలా మలిచి వుంటారనే ఆసక్తిని కనబరుస్తున్నారు.

English summary
Aravind Aakash joins the star cast of superstar Rajinikanth's upcoming film Kaala, which is directed by Pa Ranjith. In the film he plays a Marathi police officer called Shivaji Rao Gaekwad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu