»   »  మ్యూజిక్ పెర్ఫార్మెన్స్: వెంకటేష్ కొడుకు అదరగొట్టాడు

మ్యూజిక్ పెర్ఫార్మెన్స్: వెంకటేష్ కొడుకు అదరగొట్టాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ భవిష్యత్లో పెద్ద సినిమా స్టార్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అర్జున్ ఇప్పటి నుండి సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై అసక్తి చూపుతుండటమే ఇందుకు కారణం. ఇటీవల అర్జున్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో జరిగిన వరల్డ్ మ్యూజిక్ డే ఈవెంట్ సందర్భంగా తన మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు.

Arjun Daggubati music performence

అర్జున్ దగ్గుబాటి స్వయంగా గిటార్ వాయిసతూ పాట పాడుతూ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఈ మ్యూజిక్ డే ఈవెంటుకు హైలెట్ గా నిలిచింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా.... అర్జున్ చిన్నతనం నుండే అద్భుతమైన టాలెంట్ ప్రదర్శిస్తున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరైన అర్జున్... అక్కయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు అర్జున్ పెర్ఫార్మెన్స్ చూసి తెగ మురిసి పోయారు.

వాస్తవానికి అర్జున్ అప్పట్లో గోపాల గోపాల సినిమా ప్రారంభోత్సవం లో దర్శనం ఇవ్వడంతో అతను ఆ సినిమాలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటి దేమీ జరుగలేదు. అర్జున్ చదువు పూర్తయిన తర్వాత సినిమా రంగం వైపు నడిపించాలని వెంకటేష్ ఆలోచనగా కనిపిస్తోంది.

English summary
Arjun Daggubati, the son of actor Venkatesh, was the surprise star at a World Music Day event held at Hyderabad Public School on Saturday.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu