శ్రీదేవి వల్ల విడాకులు: అమ్మ, చెల్లి, నేను చాలా క్లిష్టంగా బ్రతికామన్న అర్జున్ కపూర్!

సవతి తల్లి శ్రీదేవి, స్టెప్ సిస్టర్స్ ఝాన్వి, ఖుషి తో క్లోజ్ బాండింగ్ లేదని, ఎప్పుడూ కలిసి వారితో కలిసి టైమ్ స్పెండ్ చేయలేదని, వారిని కలిసిన సందర్బాలు కూడా చాలా తక్కువ అని తెలిపారు.

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తన తాజా సినిమా 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్' సినిమా ప్రమోషన్లో..... సవతి తల్లి శ్రీదేవి, ఆమె ఇద్దరు కూతుర్లు ఝాన్వి, ఖుషీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసారు. వాళ్లతో తనకు క్లోజ్ బాండింగ్ లేదని స్పష్టం చేసాడు.

నిర్మాత బోనీ కపూర్ మొదట మోనాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఆమె ద్వారా అర్జున్ కపూర్, అన్షులా జన్మించారు. తర్వాత మోనాకు విడిడాకులు ఇచ్చి హీరోయిన్ శ్రీదేవిని పెళ్లాడారు. బోనీ కపూర్, మోనా విడిపోయే సమయంలో అర్జున్ కపూర్ వయసు 11 సంవత్సరాలు.

శ్రీదేవి, ఝాన్వి, ఖుషీ గురించి...

శ్రీదేవి, ఝాన్వి, ఖుషీ గురించి...

‘హాఫ్ గర్ల్ ఫ్రెండ్' సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో..... స్టెప్ మదర్ శ్రీదేవి, స్టెప్ సిస్టర్స్ ఝాన్వి, ఖుషి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి అర్జున్ సమాధానం ఇస్తూ వారితో క్లోజ్ బాండింగ్ లేదని, ఎప్పుడూ కలిసి వారితో కలిసి టైమ్ స్పెండ్ చేయలేదని, వారిని కలిసిన సందర్బాలు కూడా చాలా తక్కువ అని తెలిపారు.

అమ్మ గర్వపడేలా చేయలేక పోయాను

అమ్మ గర్వపడేలా చేయలేక పోయాను

అమ్మ(మెనా కపూర్) ఐదేళ్ల క్రితం క్యాన్సర్ తో మరణించింది. కష్టకాలంలో నా చెల్లి అన్షులా నాకు చాలా సపోర్టివ్ గా ఉంది. అమ్మ బ్రతికుండగా ఆమె గర్వపడేలా ఏదైనా చేసే పరిస్థితిలో నేను లేదు అని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చారు.

విడాకుల తర్వాత కష్టపడ్డాం

విడాకుల తర్వాత కష్టపడ్డాం

అర్జున్ తండ్రి బోనీ కపూర్ హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, మోనాకు విడాకులు ఇచ్చారు. ఈ విషయాన్ని అర్జున్ కపూర్ గుర్తు చేసుకుంటూ..... అప్పుడు మా పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని అర్జున్ కపూర్ తెలిపారు.

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికొస్తే...

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికొస్తే...

హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయానికొస్తే.... చేతన్ భగత్ నవల ఆధారంగా అదే పేరుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో అర్జున్ కపూర్ సరసన శ్రద్ధా కపూర్ నటించింది. మే 19న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X