పవన్ కళ్యాణ్ పాత జ్ఞాపకాలను పంచుకున్న అర్జున్ రెడ్డి దర్శకుడు.. 20 ఏళ్ళ క్రితం అలా..

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ లో ప్రస్తుతం మంచి క్రేజ్ అందుకుంటున్నాడు. అర్జున్ రెడ్డి కథను హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి ఏకంగా సరికొత్త బాక్సాఫీస్ రికార్డును క్రియేట్ చేశాడు. ఇక రణ్ బీర్ కపూర్ తో మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు ఎనిమల్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి.

ఎలాగైనా ఎనిమల్ సినిమాతో నేషనల్ లెవెల్లో క్రేజ్ అందుకోవాలని సందీప్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ సినిమా కోసం బడ్జెట్ కూడా గట్టుగానే పెడుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే సందీప్ రెడ్డి ఇటీవల పవన్ కళ్యాణ్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. సందీప్ మెగాస్టార్ చిరంజీవితో పాటు పవన్ కళ్యాణ్ ను అమితంగా ఇష్టపడతాడు.

Arjun reddy director sandeep reddy vanga about pawan kalyan memories

చాలా ఇంటర్వ్యూలతో తన అభిమాన హీరోలు వారేనని పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉన్నట్లు కోరికను కూడా బయటపెట్టాడు. ఇక ఇప్పుడు పవర్ స్టార్ పై అభిమానంతో దాచుకున్న ఒకప్పటి పెప్సీ యాడ్ ఫొటోలను అలాగే ఖుషి, జానీ ఆడియో క్యాసెట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. గోల్డ్ మైన్ మెమోరీస్ అంటూ ఒక్కసారిగా ఈ జ్ఞాపకాలు 20 ఏళ్ళ క్రితం వెనక్కి తీసుకువెళ్లినట్లు ఉందని ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. దీంతో మెగా అభిమానులు కూడా ఆ ఫొటోలను షేర్ చేసుకుంటూ వారి దగ్గర ఉన్న పాత జ్ఞాపకలను కూడా పోస్ట్ చేస్తున్నారు. మరి సందీప్ రెడ్డి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X