»   » అర్జున్ రెడ్డి... కనిపించేంత దగ్గరకొచ్చేసాడు

అర్జున్ రెడ్డి... కనిపించేంత దగ్గరకొచ్చేసాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'అర్జున్ రెడ్డి' టీజర్ విడుదల మొదలుకొని విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్నది. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్ర టీజర్ రొటీన్ ఫార్మాట్ కు భిన్నంగా ఉండటమే కాక యువతను ఆకట్టుకునే విధంగా కూడా ఉండటంతో ఈ సినిమాపై అద్భుతమైన స్పందనను దక్కించుకుంది.

ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో

ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో

అంతేగాక ఈ ఒక్క టీజర్ సినిమాపై భారీ స్థాయి అంచనాలను కూడా పెంచింది. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుపుకుంటోంది. ‘అర్జున్ రెడ్డి'. టీజర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నెమ్మదిగా ఈ సినిమా వార్తల్లోంచి వెళ్లిపోయింది.

త్వరగా షూటింగ్ పూర్తి

త్వరగా షూటింగ్ పూర్తి

టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెస్తే సినిమాకది అడ్వాంటేజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో ‘అర్జున్ రెడ్డి' కనిపించుట లేదంటూ ఈ మధ్య మీడియాలో వార్తలొచ్చాయి. దీంతో ఆ సినిమా టీం స్పందించింది.

డబ్బింగ్ కార్యక్రమాలు

డబ్బింగ్ కార్యక్రమాలు

‘అర్జున్ రెడ్డి' విడుదలకు ముస్తాబవుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.జూన్ లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు అని సమాచారం. ప్రణయ్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ

వైవిధ్యభరితమైన కథా కథనాలతో ఈ సినిమా తెరకెక్కింది. తన కెరియర్ కి ఈ సినిమా బాగా హెల్ప్ అవుతుందని విజయ్ దేవరకొండ భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. ‘పెళ్లిచూపులు' విడుదలడానికంటే ముందు మొదలైన సినిమా ‘అర్జున్ రెడ్డి'.

మంచి రెస్పాన్స్ రావడం

మంచి రెస్పాన్స్ రావడం

చాలా తక్కువ బడ్జెట్లో చిన్న సినిమాగా దీన్ని మొదలుపెట్టారు. ఐతే ‘పెళ్లిచూపులు' తర్వాత విజయ్ ఇమేజ్ మారిపోవడం.. పైగా ‘అర్జున్ రెడ్డి' టీజర్ కు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ రావడం.. సినిమా మీద అంచనాలు పెరగడంతో చిత్ర యూనిట్ కు కొంచె ఆర్థిక స్వేచ్ఛ వచ్చినట్లుంది.

జూన్ నెలలో రిలీజ్

జూన్ నెలలో రిలీజ్

సినిమా బడ్జెట్ పెంచి.. ఫారిన్ లొకేషన్లకు కూడా వెళ్లి సినిమాను షూట్ చేశారు. స్క్రిప్టులో కూడా కొంచెం మార్పులు చేసినట్లు సమాచారం. హీరో విజయ్ తన పాత్రకు డబ్బింగ్ చెప్తున్నాడు. ఇకపోతే ఈ చిత్రం యొక్క ట్రైలర్ ను మే నెలలో రిలీజ్ చేసి సినిమాను జూన్ నెలలో రిలీజ్ చేయాలనే యోచనలో ఉన్నారట దర్శకనిర్మాతలు. నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ వంగ నిర్మిస్తుండగా ‘అందాల రాక్షసి' ఫేమ్ రాధన్ సంగీతం, తోట రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

English summary
Arjun Reddy finished the entire production shot in various locations of Hyderabad, Dehradun, Mangalore, New Delhi and foreign locations in Italy. When is Arjun Reddy releasing has been the most asked question. The first news from the team since the teaser is out now, Arjun Reddy dubbing has started.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X