»   » అర్జున్ రెడ్డి అరాచకం మొదలయ్యింది: వచ్చే హైప్ ని బట్టి ఇదీ రిపోర్ట్

అర్జున్ రెడ్డి అరాచకం మొదలయ్యింది: వచ్చే హైప్ ని బట్టి ఇదీ రిపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న 'అర్జున్ రెడ్డి' టీజర్ విడుదల మొదలుకొని విశేషమైన క్రేజ్ సంపాదించుకొన్నది. ఈ మధ్యే విడుదలైన ఈ చిత్ర టీజర్ రొటీన్ ఫార్మాట్ కు భిన్నంగా ఉండటమే కాక యువతను ఆకట్టుకునే విధంగా కూడా ఉండటంతో ఈ సినిమాపై అద్భుతమైన స్పందనను దక్కించుకుంది.అంతేగాక ఈ ఒక్క టీజర్ సినిమాపై భారీ స్థాయి అంచనాలను కూడా పెంచింది.

వార్తల్లోంచి వెళ్లిపోయింది.

వార్తల్లోంచి వెళ్లిపోయింది.

షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్దంగా ఉంది. జస్ట్ రెండు రోజుల దూరంలో ఉన్నాడు అర్జున్ రెడ్డి . మొదట్లో‘అర్జున్ రెడ్డి'. టీజర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ.. ఆ తర్వాత సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేకపోవడంతో నెమ్మదిగా ఈ సినిమా వార్తల్లోంచి వెళ్లిపోయింది.


Vijay Deverakonda Making Fun @Arjun Reddy Theatrical Trailer Launch
ఫార్మాట్ ని కూడా మార్చి పడేసాడు

ఫార్మాట్ ని కూడా మార్చి పడేసాడు

అసలు కొన్నాళ్ళ పాటు అసలు ఈ సినిమాని అంతా మర్చిపోయేదశకు వెళ్ళిపోయారు. అంతంత గ్యాప్ వస్తే సాధారణం గా ఆ సినిమాకి హైప్ తగ్గిపోతుంది కానీ అర్జున్ రెడ్డి ఈ ఫార్మాట్ ని కూడా మార్చి పడేసాడు... 'అర్జున్‌ రెడ్డి'కి ఫుల్‌ హైప్‌ వచ్చేసింది. యూత్‌ అంతా ఈ చిత్రాన్ని వీలయినంత త్వరగా చూడాలని ఫిక్స్‌ అయిపోయారు.


పెయిడ్‌ ప్రీమియర్స్‌

పెయిడ్‌ ప్రీమియర్స్‌

ఈ క్రేజ్‌ కనిపెట్టి శుక్రవారం విడుదలవుతోన్న చిత్రానికి ఒక రోజు ముందే పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేస్తున్నారు. అలా పెయిడ్‌ ప్రీమియర్లు వేస్తోన్న థియేటర్లు అన్నిట్లోను ఈ చిత్రం టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. షో ఓపెన్‌ చేయడం ఆలస్యం నిమిషాల్లో టికెట్లన్నీ సేల్‌ అయిపోతున్నాయి. శుక్రవారం నాటి బుకింగ్స్‌ కూడా తారాస్థాయిలో వున్నాయి.


అడ్వాన్స్‌ బుకింగ్స్‌

అడ్వాన్స్‌ బుకింగ్స్‌

ఈ చిత్రం లో బడ్జెట్‌లో రూపొందింది కనుక మామూలుగా ఆడినా సక్సెస్‌ అయిపోతుంది. ఏదో భారీ సినిమాకి వచ్చినట్టుగా అడ్వాన్స్‌ బుకింగ్స్‌ జరుగుతున్నాయంటే అర్జున్‌ రెడ్డి పెద్ద రేంజ్‌కి వెళుతుందేమో అనిపిస్తోంది. ఈ చిత్రంపై అపారమైన నమ్మకం చూపిస్తోన్న హీరో విజయ్‌ దీనిపై చాలా బెట్లు కడుతున్నాడు.


విజయ్‌ విరుచుకుపడ్డాడు

విజయ్‌ విరుచుకుపడ్డాడు

తన కాన్ఫిడెన్స్‌ని శంకించిన వారికి కూడా గట్టిగా బదులిస్తున్నాడు. ఈ చిత్రంలో చాలా డైలాగులని మ్యూట్‌ చేసిన సెన్సార్‌పై కూడా విజయ్‌ విరుచుకుపడ్డాడు. అయితే ఇలా మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు అర్జున్ రెడ్డిని గెలిపిస్తుందేమో కానీ తర్వాత ఇండస్ట్రీలో ప్రాబ్లమ్స్ వస్తాయని ఎవ్వరూ చెప్పలేదా విజయ్ కి...English summary
Vijay Deverakonda and his team is heating up the beat with some interesting update and considerations.The new age love saga of a House surgeon is titled Arjun Reddy and the first teaser was absolutely impressing.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu