»   » నో సెన్సార్, నో కటింగ్స్.... మూడున్నర గంటల ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

నో సెన్సార్, నో కటింగ్స్.... మూడున్నర గంటల ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ డేట్ ఫిక్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Uncensored Version Of "Arjun Reddy" Coming This Month

విజయ్ దేవరకొండ, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన 'అర్జున్ రెడ్డి' ఇటీవల విడుదలై తెలుగు సినిమా చరిత్రలో ఓ సంచలనం అయింది. సినిమా స్టోరీ రొటీనే అయినా... సినిమాను తెరకెక్కించిన తీరు భిన్నంగా ఉండటంతో సూపర్ హిట్ అయింది.

ఈ సినిమాలో వాడిన కొన్ని సీన్లు, డైలాగులపై తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అనేక వివాదాలు చెలరేగాయి. సెన్సార్ బోర్డు వాటిని తొలగించింది కూడా. దీంతో పాటు సినిమా నిడివి కూడా మూడున్నర గంటలకు పైగా తెరకెక్కించారు. అయితే థియేటర్లలో అంత సమయం ప్రదర్శించడం కష్టం కాబట్టి 3 గంటలకు కుదిరించారు.

అన్ సెన్సార్డ్ అర్జున్ రెడ్డి

అన్ సెన్సార్డ్ అర్జున్ రెడ్డి

‘అర్జున్ రెడ్డి' సినిమా చూసిన చాలా మంది.... సినిమా పూర్తిగా ఉంటే బావుండేదని, సెన్సార్ కటింగ్స్ కూడా లేకుంటే మరింత బావుండేదని ఫీలయ్యారు. అలా కోరుకున్న వారి కోరిక త్వరలో నెరవెరబోతోంది.


అమెజాన్ ప్రైమ్ విడుదల

అమెజాన్ ప్రైమ్ విడుదల

తొలుత డీవీడీ ద్వారా అర్జున్ రెడ్డి అన్ సెన్సార్ వెర్షన్ రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ నిర్మాతల నిర్ణయం మారింది. అమెజాన్ ప్రైమ్ ద్వారా ‘అర్జున్ రెడ్డి' అన్ సెన్సార్డ్, పూర్తి నిడివి ఉన్న సినిమాను ఈ నెల 13న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ వెబ్ సైట్లోకి వెళ్లి నేరుగా ఈ సినిమా చూడొచ్చు.


మేకింగ్ వీడియో

విజయ్ దేవరకొండ, శాలిని పాండే హీరో హీరోయిన్లుగా సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'అర్జున్ రెడ్డి'. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా షూటింగ్ జరిగిన తీరు, షూటింగ్ సమయంలో నటీనటుల, టెక్నీషియన్స్ అనుభవాలను పొందుపరుస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు.


నాన్నను ఎదురించా, పోలీస్ కంప్లయింట్ బెదిరింపు... (‘అర్జన్ రెడ్డి' హీరోయిన్ రియల్ స్టోరీ)

నాన్నను ఎదురించా, పోలీస్ కంప్లయింట్ బెదిరింపు... (‘అర్జన్ రెడ్డి' హీరోయిన్ రియల్ స్టోరీ)

‘అర్జన్ రెడ్డి' హీరోయిన్ రియల్ స్టోరీ గురించి వెల్లడించింది....


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి


English summary
Uncensored version of Arjun Reddy on Amazon Prime on the 13th of this month. Earlier, the plan was to release a DVD but the makers decided to create a new record in the digital media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu