»   » దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా, దర్శకుడిపై అరెస్టు వారెంట్

దీపిక పదుకోన్, ప్రియాంక చోప్రా, దర్శకుడిపై అరెస్టు వారెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణవీర్ సింగ్, దీపిక పదుకోన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'రామ్ లీలా' చిత్రం విడుదల సమయంలోనే వివాదాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కొన్ని సీన్లు ఓ వర్గం సెంటిమెంట్స్ దెబ్బతీసే విధంగా ఉన్నాయని అప్పట్లో కొందరు కోర్టుకెక్కారు. ఆ కేసు ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఈ కేసుకు సంబంధించిన... తాజాగా చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, దీపిక పదుకోన్, రణవీర్ సింగ్, ప్రియాంక చోప్రాలపై కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. అడ్వకేట్ సుధీర్ కుమార్ ఓఝా నవంబర్ చివరి వారంలో ఈ సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేసిన కేసుకు సంబంధించి ఈ అరెస్టు వారెంట్ జారీ అయింది.

Arrest Warrants Issued Against Actors, Makers Of Ram Leela!

మధ్యప్రదేశ్ హైకోర్టు సినిమాపై అప్పట్లో నవంబర్ 22 వరకు నిషేదం విధించినప్పటికీ నవంబర్ 12న సినిమాను విడుదల చేసారు. దీంతో చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ సినిమా దర్శక నిర్మాతలు, యాక్టర్లకు సమన్లు జారీ చేసారు. ఫిబ్రవరి 14న కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. అయితే ఆ సమన్లను వారు పట్టించుకోక పోవడంతో ఇపుడు అరెస్టు వారెంటు జారీ చేసారు.

ఈ మేరకు సినిమా దర్శక నిర్మాతలు, నటీనటులను అరెస్టు చేసి జూన్ 4వ తేదీలోగా తమ ముందు హాజరు పరుచాల్సిందిగా చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ ఎస్.పి.సింగ్ ముంబై పోలీస్ కమీషనర్‌ను ఈ రోజు ఆదేశించారు.

English summary
Fresh trouble for makers and actors of the movie Ram Leela as a local Court has issued arrest warrants against the director Sanjay Leela Bhansali along with actors Deepika Padukone, Ranveer Singh and Priyanka Chopra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu