»   » తప్పతాగి పోలీసు వాహనాన్నే గుద్దేసాడు: రామ్ చరణ్ మూవీ విలన్ అరెస్ట్!

తప్పతాగి పోలీసు వాహనాన్నే గుద్దేసాడు: రామ్ చరణ్ మూవీ విలన్ అరెస్ట్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నటుడు అరుణ్ విజయ్ అరెస్టయ్యాడు. తప్పతాగి వేగంగా కారు నడిపిన అతను ఏకంగా పోలీసు వాహనాన్నే గుద్దేయడంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసారు. చెన్నైలోని నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది.

శుక్రవారం సాయంత్ర చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ కు హాజరైన అరుణ్ విజయ్... అక్కడ జరిగిన పార్టీలో బాగా మద్యం సేవించాడు. పార్టీ ముగిసిన అనంతరం శనివారం తెల్లవారుఝామున 3.40 గంటలకు బిఎండబ్ల్యూ కారులో ఇంటికి బయల్దేరాడు ఈ క్రమంలో నుంగంబాక్కం పోలీస్ స్టేషన్ ముందు ఆగి ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీ కొట్టాడు.

వెంటనే అతన్ని అరెస్టు చేసిన పోలీసులు అతన్ని విచారిస్తుండగా అరుణ్ విజయ్ తండ్రి విజయ్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. కొడుకును విడిపించే ప్రయత్నాలు చేపట్టారు. అధికారులతో మాట్లాడిన అనంతరం సొంత పూచికత్తుపై అరుణ్ విజయ్ ను విడుదల చేసారు.

ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ కుమార్ తనయుడైన అరుణ్ విజయ్.... సౌత్ సినిమాల్లో విలన్ పాత్రల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. ఆ మధ్య వచ్చిన 'ఎంతవాడు గానీ' సినిమాలో అరుణ్ విజయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయ్యాడు. తర్వాత రామ్ చరణ్ మూవీ 'బ్రూస్ లీ'లో విలన్ పాత్రలో నటించాడు.

అరుణ్ విజయ్

అరుణ్ విజయ్

తమిళ నటుడు అరుణ్ విజయ్ ఇతడే....

అరెస్టు సందర్భంలో..

అరెస్టు సందర్భంలో..

అరెస్టు అనంతరం బెయిల్ మీద విడుదలయి ఇంటికి వెలుతున్నసమయంలో....

విజయ్ కుమార్ తనయుడు

విజయ్ కుమార్ తనయుడు

ప్రముఖ సినీయర్ నటుడు విజయ్ కుమార్ తనయుడే ఈ అరుణ్ కుమార్.

రామ్ చరణ్ మూవీలో

రామ్ చరణ్ మూవీలో

రామ్ చరణ్ బ్రూస్ లీ మూవీలో అరుణ్ విజయ్ ఫైట్ సీన్.

ఎంతవాడుగానీ

ఎంతవాడుగానీ

అజిత్ తో కలిసి ఎంతవాడుగానీ చిత్రంలో అరుణ్ విజయ్.

English summary
Tamil Actor Arun Vijay had rammed into a police vechile that was parked outside the Nugambakkam police station. Arun vijay was reportedly driving his BMW sedan and accidentally rammed his car into the police vehicle parked at the entrance of the Nungambakkam police station.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu