»   » ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే కొడుకు కన్నుమూత

ప్రముఖ సింగర్ ఆశా భోంస్లే కొడుకు కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ సినీ గాయని ఆశా భోంస్లే పెద్ద కుమారుడు హేమంత్ భోంస్లే సోమవారం కన్నమూసారు. గత ఐదేళ్లుగా క్యాన్సర్ తో పోరాడుతున్న హేమంత్ నిన్న తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు.

మ్యూజిక్ డైరెక్టర్ అయిన హేమంత్ భోంస్లే గత కొన్ని రోజులుగా స్కాట్లాండులోనే ఉంటున్నారు. కెరీర్లోనే పలు సూపర్ హిట్ పాటలను ఆయన అందించారు. ఆయన కంపోజ్ చేసిన పాటల్లో ఎక్కువ శాతం ఆశా భోంస్లే పాడటం గమనార్హం.

Asha Bhosle's son Hemant passes away in Scotland

హేమంత్ భోంస్లే మరణానికి ఒక రోజు ముందు ఆశా భోంస్లే ఓ మ్యూజిక్ కార్యక్రమంలో పాల్గొనడంలో భాగంగా సింగపూర్‌లో ఉన్నారు. కుమారుడి మరణ వార్త తెలియడంతో వెంటనే ఆమె స్కాట్లాండు వెళ్లారు.

సోమవారం ఆశా భోంస్లే సోదరి లతా మంగేష్కర్ పుట్టిరోజు. హేమంత మరణంతో పుట్టినరోజు వేడుకలు రద్దయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ స్కాట్లాండు చేరుకున్నారు. మూడేళ్ల క్రితం ఆశా భోంస్లే కూతురు వర్ష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

English summary
Asha Bhosle's son Hemant Bhosle passed away on September 28. He was 66.
Please Wait while comments are loading...