»   »  లెజెండరీ సింగర్‌కు అరుదైన అవకాశం, కొలతలు తీసుకున్నారు (ఫోటోస్)

లెజెండరీ సింగర్‌కు అరుదైన అవకాశం, కొలతలు తీసుకున్నారు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: లెజెండరీ సింగర్, బాలీవుడ్ సింగింగ్ సెన్సేషన్ ఆశా భోంస్లేకు అరుదైన గౌరవం దక్కబోతోంది. ప్రపంచంలోని పలువురు సెలబ్రిటీల మైనపు విగ్రహాలను తయారు చేసి తమ వాక్స్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచుతున్న మేడమ్ టుస్సాడ్స్ వారు.... త్వరలో ఆశా భోంస్లే మైనపు విగ్రహాన్ని సిద్ధం చేయబోతున్నారు.

ఈ విషయాన్ని మంగళవారం న్యూఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ సంస్థ ప్రతినిధులు అనౌన్స్ చేశారు. తమ మ్యూజియంలోని బాలీవుడ్ మ్యూజిక్ జోన్ లో ఇతర లీడింగ్ సింగర్స్ తో కలిపి ఆమె మైనపు విగ్రహం ప్రదర్శనకు ఉంచబోతున్నారు.

ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది

ఆల్రెడీ ప్రాసెస్ మొదలైంది

ఆశా భోంస్లే మైనపు విగ్రహాం తయారీకి సంబంధించిన ప్రాసెస్ మొదలైంది. ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులు వచ్చి ఆమె కొలతలు తీసుకెళ్లారు.

ఆరు దశాబ్దాలుగా అలుపు లేకుండా

ఆరు దశాబ్దాలుగా అలుపు లేకుండా

ఆశా భోంస్లే ఆరు దశబ్దాలుగా అలుపు లేకుండా భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన సేవల అందిస్తున్నారు. ఇండియన్ సింగింగ్ లెజెండ్స్‌లో ఆమె కూడా ఒకరు. బాలీవుడ్లో ఐకానిక్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందారు.

20కి పైగా భాషల్లో

20కి పైగా భాషల్లో

ఆశా భోంస్లే 20కి పైగా ఇండియన్, ఫారిన్ లాంగ్వేజ్ లో వేలాది పాటలు పాడారు. ఎక్కువ పాటలు పాడిన ఆర్టిస్టుగా ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్నారు. సినిమా రంగంలో అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో పాటు, పద్మభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి.

ఎగ్జైట్ అయిన ఆశా

ఎగ్జైట్ అయిన ఆశా

మేడమ్ టుస్సాడ్స్ వారు తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఈ విషయం తెలిసి చాలా థ్రిల్లయ్యాను. తనకు ఇలాంటి ఇంక్రెడబుల్ హానర్ ఇచ్చినందుకు మేడమ్ టుస్సాడ్స్ వారికి థాంక్స్. ఇదో సరికొత్త అనుభూతి అని ఆమె తెలిపారు.

English summary
News is that legendary singing sensation Asha Bhosle is all set to surprise her fans at Madame Tussauds wax museum. It was announced today in New Delhi that an installation of a wax statue of Asha Bhosle will join the heroes and icons at the famed attraction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu