»   » రేటింగ్ 4: హృతిక్ రోషన్ ‘మొహంజోదారో’ మూవీ (యూకె రివ్యూ)

రేటింగ్ 4: హృతిక్ రోషన్ ‘మొహంజోదారో’ మూవీ (యూకె రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న సినిమా 'మొహెంజోదారో'. చారిత్రక నేపథ్యం, భారీ బడ్జెట్, డిఫరెంట్ కాన్సెప్టుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగస్టు 12న గ్రాండ్‌గా రిలీజవుతోంది.

  ఆ మధ్య రిలీజైన టీజర్, ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. బ్రిటిష్ పాలనకటే ముందు, మొగలాయిల కంటే ముందు, క్రీస్తు కంటే ముందు, అలెగ్జాండర్ రాక కంటే ముందు, బుద్దుడి కంటే ముందు....ఇండియాలో మొహంజోదారో నాగరికత విలసిల్లిన సంగతి తెలిసిందే. ఇదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్, టీజర్ రిలీజ్ చేసారు.

  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యూకె రిపోర్ట్ వచ్చేసింది. యూకె, యూఏఇలో ఇండియన్ సినిమా మేగజైన్ ఎడిటర్‌, ఫిల్మ్ క్రిటిక్‌గా, యూఏఇ సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా ఉన్న ఉమైర్ సంధు సినిమా చూసిన తన అభిప్రాయాలు వెల్లడించారు. సినిమాకు ఏకంగా 4/5 రేటింగ్ ఇచ్చారు.

  సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలు ఏమిటో స్లైడ్ షోలో చూద్దాం...

  మొహంజోదారో..

  మొహంజోదారో..

  మొహంజోదారో సినిమా ఇండియన్ సినిమా పరిశ్రమలో వచ్చిన అద్భుత చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని, ఔట్ స్టాడింగ్ గా ఉందని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.

  పాత్రల ఎంపిక సూపర్

  పాత్రల ఎంపిక సూపర్

  సినిమాలోని పాత్రలకు పర్ ఫెక్టుగా సూటయ్యే విధంగా దర్శకుడు కాస్టింగ్ అద్భుతంగా చేసారని.... కథకు తగిన విధంగా పాత్రలను చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడారు.

  హృతిక్ రోషన్

  హృతిక్ రోషన్

  హృతిక్ రోషన్ ను ఈ సినిమాలో చూస్తుంటే ఆయన తప్ప ఈ పాత్రకు మరెవరూ సెట్ కారనే విధంగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మైండ్ బ్లోయింగ్, ఈ పాత్ర కోసమే పుట్టినట్లు అనిపించింది. అవార్డు రావడం ఖాయం అన్నారు.

  పూజా హెడ్గే

  పూజా హెడ్గే

  పూజా హెడ్గే అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా సూపర్బ్. ఎలాంటి లోపాలు లేకుండా బాగా నటించిందని ఉమైర్ సంధు చెప్పారు.

  కబీర్ బేడీ

  కబీర్ బేడీ

  సీనియర్ యాక్టర్ కబీర్ బేడీ ఔట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇతర నటీనటులంతా అద్భుతంగా చేసారని ఉమైర్ సంధు తెలిపారు.

  కథ గురించి...

  కథ గురించి...

  సినిమా స్క్రిప్టు చాలా బావుంది. సినిమా సాగే తీరు మిమ్మల్ని సీట్లకు అతుక్కుపోయేలా చేస్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ ట్రాక్ సూపర్బ్ గా ఉందని ఆయన తెలిపారు.

  డైలాగులు

  డైలాగులు

  సినిమాలోని డైలాగ్స్ అమేజింగ్ గా ఉన్నాయి. అక్కడక్కడా రత్నాల్లాంటి మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు.

  డైరెక్షన్

  డైరెక్షన్

  భారీ చిత్రాలు, చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అని అశుతోష్ గోవరికర్ మరోసారి నిరూపించారు. ఆయన డైరెక్షన్ ఔట్ స్టాండింగ్ అని పొగడ్తలు గుప్పించారు.

  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ

  డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ

  ఈ సినిమాకు బాగా హైలెట్ అయిన అంశాల్లో సినిమాటోగ్రఫీ ఒకటి. ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉంది. యాక్షన్ స్టంట్స్ సింప్లీ మైండ్ బ్లయింగ్ అని ఉమైర్ సంధు చెప్పుకొచ్చారు.

  బావున్నాయి

  బావున్నాయి

  సినిమాలో విఎఫ్ఎక్స్ సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. రెహమాన్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుందని తెలిపారు.

  రేటింగ్

  రేటింగ్

  సినిమాకు 4/5 రేటింగ్ ఇచ్చిన ఉమైర్ సంధు ప్రతి ఒక్కరికి సినిమా నచ్చుతుందని చెప్పుకొచ్చారు.

  ఉమైర్ సంధు రివ్యూలు నమ్మొచ్చా

  ఉమైర్ సంధు రివ్యూలు నమ్మొచ్చా

  గతంలోనూ ఉమైర్ సంధు చాలా సినిమాలకు రివ్యూ ఇచ్చారు. అందులో కొన్ని నిజం అవ్వగా... మరికొన్ని తలక్రిందులయ్యాయి. బాహుబలికి ఆయన చాలా పూర్ రేటింగ్ ఇచ్చారు. కానీ సినిమా పెద్ద హిట్టయి కూర్చుకుంది. కబాలికి మంచి రేటింగ్ ఇచ్చినా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మరి మొహంజోదారో విషయంలో ఉమైర్ సంధు చెప్పిన విషయాలు ప్రేక్షకుల అభిప్రాయాలతో సరితూగుతాయో? లేదో? రేపు తేలనుంది.

  English summary
  Now lets check the UK Review of Mohenjo Daro given by Umair Sandhu, where the movie has got a 4-star rating and impressed the UK people. Here is the UK Review of Mohenjo Daro. Bollywood Greek God Hrithik Roshan and Pooja Hegde are seen in the lead roles, where Hrithik will be seen as a normal farmer. When he travel to the great city Mohenjo Daro, he comes across Pooja and falls in love with her, here the love story blossoms.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more