»   » 106 డిగ్రీల జ్వరం...లైఫ్ రిస్క్ చేసిన చిరంజీవి!

106 డిగ్రీల జ్వరం...లైఫ్ రిస్క్ చేసిన చిరంజీవి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎవరి సపోర్టు లేకుండా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన చిరంజీవి.....తన టాలెంటుతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తెలుగు సినిమా బాక్సాఫీసును శాసించే ‘మెగాస్టార్'గా ఎదిగారు. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారనేది మాటల్లో చెప్పడం కష్టం.

ఆయన దర్శక, నిర్మాతల హీరోగా పేరు తెచ్చుకన్నాడు. ఆయన ఏ సినిమా చేసినా క్రమశిక్షణ, అంకింత భావంతో చేసే వారు. చిరంజీవి పెర్ఫార్మెన్స్, టాలెంటుకుతోడు క్షమశిక్షణ, అంకిత భావం తోడవటం వల్లనే ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ప్రజలకు సేవ చేయాలనే గుణం ఆయనలోని అదనపు క్వాలిఫికేషన్ అని చెబుతుంటారు చిరంజీవి సన్నిహితులు.

ఆయన సినిమాకు ఎంత అంకింత భావంతో పని చేస్తారనేది....‘జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా సమయంలో జరిగిన ఓ సంఘటనే నిదర్శనం. ఈ చిత్రంలో ‘దినక్కుథా...దిక్కుర్రో...' అనే సాంగు చిత్రీకరణ సమయంలో చిరంజీవి 106 డిగ్రీల జ్వరంతో బాధ పడుతున్నారు. డాక్టర్లు ఆయన్ను బెడ్ రెస్టు తీసుకోవాల్సిందే అని సూచించారు.

Ashwini Dutt about Chiranjeevi

అయితే ఈ చిత్రంలో నటిస్తున్న శ్రీదేవి మరో రెండు రోజులు గడిస్తే...హిందీ సినిమా షూటింగుల్లో భాగంగా విదేశాలకు వెలుతుంది. ఆమె వెళ్లి మళ్లీ నెలన్నర రోజుల దాకా అందుబాటులోకి రాదు. ఆమె అందుబాటలో ఉన్నపుడే సాంగ్ ఫినిష్ చేయాలని డిసైడయ్యారు చిరంజీవి.

తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా షూటింగుకు రెడీ అయ్యారు. చిరంజీవి బాడీ టెంపరేచ్ తగ్గించడానికి, ఎలాంటి నొప్పి కలగకుండా ఐష్ క్యూబ్ లతో చిన్న ట్రీట్ మెంట్ చేసారట. షూటింగ్ లాస్ట్ షాట్ సమయంలో చిరంజీవి సెట్లోనే కుప్పకూలిపోయారు. తర్వాత చిరంజీవి విజయ హాస్పటల్ లో అడ్మిట్ అయ్యారు. వారం రోజుల తర్వాత కోలుకున్నారు. ఈ విషయాలను ఆ చిత్ర నిర్మాత అశ్వినీదత్ గుర్తు చేసుకున్నారు. ఈ కాలంలో అంత డెడికేషన్ గల హీరోలు ఎవరుంటారు చెప్పండి?

English summary
Completion of 25 years of 'Jagadeka Veerudu Athiloka Sundari', producer Ashwini Dutt has made a fantastic video where Chiru, Raghavendra Rao, Dutt and Sridevi spoke at large about the movie and other nostalgic stuff.
Please Wait while comments are loading...