»   » కంట్రీ క్లబ్ న్యూఇయర్ బాష్, చార్మితో షురూ(ఫోటోలు)

కంట్రీ క్లబ్ న్యూఇయర్ బాష్, చార్మితో షురూ(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2014 సంవత్సవరం సమీపిస్తున్న తరణంలో నూతన సంవత్సర వేడుకలు భారీగా నిర్వహించేందుకు కంట్రీక్లబ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటి నుండే ఏర్పాట్లు మొదలయ్యాయి. ప్రముఖ తెలుగు హీరోయిన్ చార్మి ఏర్పాట్లను ప్రారంభించారు. చైర్మన్ వై రాజీవ్ రెడ్డి‌తో కలిసి ఆమె కేక్ కట్ చేసారు.

గతంలో కంట్రీక్లబ్ తరుపున నిర్వహించిన నూతన వేడుకల్లో పలువురు సినీ తారలు తన ప్రదర్శనల్లో అలరించారు. ఈ సారి కూడా భారీ ఎత్తున సినీతారలను ఆహ్వానించి నూతన సంవత్సర వేడుకలను గ్రాండ్‌గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసియాలోనే బిగ్గెస్ట్ న్యూఇయర్ ఈవెంటుగా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

విదేశాల్లో కూడా

విదేశాల్లో కూడా


కంట్రీ క్లబ్ ఇండియా (సిసిఐఎల్) తన కార్యకలాపాలను అమెరికా, బ్రిటన్‌లకు విస్తరించే యోచనలో ఉంది. దేశంలో, విదేశాల్లో చేపట్టనున్న విస్తరణ కార్యకలాపాల కోసం 350 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్టు సమాచారం.

ఇప్పటి వరకు..

ఇప్పటి వరకు..


ఈ సంస్థ ఇప్పటికే శ్రీలంక, థాయ్‌లాండ్, గల్ఫ్ దేశాలకు తన వ్యాపారాన్ని విస్తరించింది. దుబాయ్‌లో 175 కోట్ల రూపాయలతో ఒక బొటిక్ హోటల్‌ను కొనుగోలు చేయడం ద్వారా గల్ఫ్ మార్కెట్లోకి ప్రవేశించింది.

సభ్యులు

సభ్యులు


దేశ, విదేశాల్లో కలిపి 55 సొంత క్లబ్‌లను నిర్వహిస్తోంది. ఇందులో 3.5 లక్షలకు పైగా సభ్యులున్నారు.

భారీ లాభాలు

భారీ లాభాలు


మార్చితో ముగిసిన త్రైమాసికంలో సిసిఐఎల్ నికర అమ్మకాలు 27 శాతానికి పైగా వృద్ధి చెంది 475.69 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో అమ్మకాలు 372 కోట్ల రూపాయలున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లా భం 56.13 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2011- 12లో లాభం 49.58 కోట్ల రూపాయలుగా ఉంది.

English summary
Country Club (India) limited rolls out the Eighth edition of Asia’s Biggest New Year Bash 2014, India — Middle East. Telugu Actress Charmi Kaur posing in Red Dress at Country Club Asia’s Biggest New Year Bash 2014 Press Meet in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu