twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అశ్వినీదత్...'జగదేకవీరుడు అతిలోకసుందరి' రీమేక్

    By Bojja Kumar
    |

    చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్లో కె.రాఘవేంద్రరావు రూపొందించిన 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. దాంతో ఆ చిత్రం సీక్వెల్ తయారు చేయాలంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' సీక్వెల్ చేస్తారంటూ కొంతకాలంగా వినపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా వార్త అధికారికంగా అశ్వనీదత్ స్పష్టం చేశారు.

    మాటీవీ వారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ఇచ్చిన సందర్భంగా తన మనసులోని మాటను బయట పెట్టారు నిర్మాత అశ్వినీదత్. రాఘవేంద్రరావు తమ బ్యానర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశారు. ఆయనతో కలిసి 'జగదేక వీరుడు అతిలోక సుందరి' చిత్రం రీమేక్ చేయాలని ఉందని వెల్లడించారు అశ్వినీదత్.

    ఇటు మెగా అభిమానులు కూడా 'జగదేకవీరుడు - అతిలోకసుందరి' రీమేక్ కావాలని కోరుకుంటున్నారు. చేస్తేగీస్తే ఈచిత్రం రామ్ చరణ్ తేజ్ తప్ప మరొకరు చేసే అవకాశం లేదుకాబట్టి అశ్వినీదత్ ఆ ప్రకటన చేయగానే అభిమానులు సంబరపడిపోయారు. గతంలోనూ అశ్వినీదత్ ఈ ఇదే మాట అన్నారు కానీ ఆచరణకు నోచుకోలేదు. మరి అభిమానులు, అశ్వినీదత్ కోరుకుంటున్నట్లు ఆ విషయం నిజం అయ్యేది ఎప్పుడో వేచి చూడాల్సిందే.

    ప్రస్తుతం అశ్వినీదత్ తన వై జయంతి మూవీస్ బేనర్‌పై రవితేజ హీరోగా 'సార్ వస్తారా' చిత్రాన్ని రూపొందించే ప్రయత్నంలో ఉన్నారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. దీంతో పాటు మహేష్, క్రిష్ కాంబినేషన్లో కూడా అశ్వినీదత్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక సమాచారం లేదు. మహేష్ బాబు హీరోగా పరిచయం అయిన 'రాజకుమారుడు' సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్లో రూపొందింది. రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేసే ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    "Jagadeka Verudu Athiloka Sundari" (1990) is a socio-fanasty film directed by K Raghavendra Rao. The pairing of megastar Chiranjeevi and Sridevi combined with the backdrop of mythology mixed fantasy was the main highlight of the film. "I want to remake "Jagadeka Verudu Athiloka Sundari" and I want KRR to direct it", said Ashwini Dutt. But who's going to star in the remake? Let's wait and see!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X