»   » పవన్ పార్టీ విషయం ద్రువీకరించిన అశ్వనీదత్

పవన్ పార్టీ విషయం ద్రువీకరించిన అశ్వనీదత్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Aswini Dutt confirmed pawan party
  విజయవాడ: పవన్ కల్యాణ్ పార్టీ పెడుతున్నట్లు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కూడా ద్రువీకరించారు. అయితే... కేవలం తొమ్మిది ఎంపీ, 40 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే తన అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా నిలుపుతారని చెప్పారు. పవన్ పార్టీ పెట్టేది పవర్ కోసం కాదని, ప్రశ్నించడం కోసమని స్పష్టం చేశారు. గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

  ఈ నెల 12న తన రాజకీయ ప్రవేశం గురించి, తాను పెట్టబోయే కొత్త పార్టీ గురించి పవన్ ప్రకటన చేస్తారని తెలుస్తున్నది. దేశ రాజకీయాలు ఏ దిశగా ఉండాలనే విషయంలో పవన్ ఇప్పటికే ఒక పుస్తకం రాశారని, దానిలోని అంశాలనే తన పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతారని వినిపిస్తున్నది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఈ నెల 12న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసే సభలోనే తన రాజకీయ రంగ ప్రవేశాన్ని కూడా ప్రకటిస్తారని సమాచారం.

  కార్యకర్తలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. పవన్ పార్టీ పెడితేనే మంచిదని వారు కూడా చెప్పారని తెలుస్తున్నది. పవన్ రాజకీయ ప్రవేశం గురించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్ వంటివారు పవన్‌ను తమ పార్టీలోకి ఆహ్వానించారు కూడా. టీడీపీ నుంచి కూడా ఆయన ఆహ్వానం అందినట్లు ప్రచారంలో ఉంది.

  పవన్ లోక్‌సభకు ఎక్కడి నుంచి పోటీ చేసినా.. తమ అభ్యర్థిని నిలుపబోమని టీడీపీ ఆఫర్ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీలో చేరుతారని కూడా ఊహాగానాలు వచ్చాయి. అయితే.. మొత్తంగానే రాజకీయ వ్యవస్థపై తనదైన అభిప్రాయంతో ఉన్న పవన్.. తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి సొంత పార్టీ ఏర్పాటు మేలన్న అభిప్రాయం ఆయన సన్నిహితవర్గాల్లో వ్యక్తమవుతున్నది. నగరంలోని మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది.

  English summary
  More or less, close aides of pawan kalyan have confirmed that the Star Hero is going to venture into politics either on 12th or 15th of this month. As per producer Aswini Dutt, this is not a political party but will serve as a platform only to serve the people for better living, saving them from real politicians.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more