»   » తేల్చి చెప్పింది: ఎట్టకేలకకు తన 'బ్రేక్ అప్' పై త్రిష ట్వీట్

తేల్చి చెప్పింది: ఎట్టకేలకకు తన 'బ్రేక్ అప్' పై త్రిష ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'బయట వస్తున్న ఊహాగానాలు విచిత్రంగా ఉన్నాయి. దయచేసి వాటికి ఫుల్‌స్టాప్ పెట్టండి. నేనిప్పుడు సింగిల్‌గా, హ్యాపీగా ఉన్నాను' అని గురువారం రాత్రి త్రిష స్వయంగా ట్వీట్ చేశారు. ఆ విధంగా త్రిష తన బ్రేక్ అప్ విషయాన్ని తేల్చి చెప్పేసింది. మరో ప్రక్క ఆమె తల్లి సైతం ...వివాహం ఆగిపోయిందనే విషయం ఖరారు చేస్తూ గురువారం తమిళ మీడియాకు తెలియచేసారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుతమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం ...ఈ ఏడాది జనవరిలో కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పెళ్లి తేదీ ప్రకటించలేదు. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారనే వార్త కొద్దిరోజులుగా హల్‌చల్ చేస్తోంది.


ఈ నేపధ్యంలో 'ఔను.. నిజమే ...పెళ్లి ఆగిపోయింది' అని త్రిష తల్లి ఉమాకృష్ణన్ తమిళ పత్రికలవారికి గురువారం తెలియజేశారు. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ మణియన్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వల్లే విభేదాలు నెలకొన్నాయనే వార్త ప్రచారం అయ్యింది. ఆ వార్త నిజం కాదని ఉమ పేర్కొన్నారు.


At last Trisha tweets about Breakup

త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు ఇష్టమేననీ, వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనీ ఆమె చెప్పారు. కుటుంబ పెద్దల నిర్ణయమే పెళ్లి రద్దు కావడానికి కారణమనీ, కానీ ఆ పెద్దల గురించి చెప్పి... వాళ్లను నొప్పించలేననీ ఆమె అన్నారు. ప్రస్తుతం త్రిష దృష్టంతా సినిమాలపైనే అని ఉమాకృష్ణన్ స్పష్టం చేశారు.


త్రిష కెరీర్ విషయానికి వస్తే...


తమిళ,తెలుగు అనే తేడా లేకుండా ... సినీ పరిశ్రమలో 20 ఏళ్ల ప్రస్థానాన్ని దాటుకుని దిగ్విజయంగా దూసుకెళ్తున్న నటి త్రిష. ప్రస్తుతం ఆమె శింబు హీరోగా నటించనున్న సినిమాకు హీరోయిన్ గా ఎంపికైంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'అలై', 'వినైతాండి వరువాయా' చిత్రాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటించనున్నారు.


ఈ చిత్రానికి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే సెల్వరాఘవన్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ఖాతాలో పేర్కొన్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చనున్నారు. 'లింగ' చిత్రంలో విలన్‌గా కనిపించి ఆకట్టుకున్న తెలుగు నటుడు జగపతిబాబు ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తున్నారు.


ఈ సినిమా గురించి త్రిష మాట్లాడుతూ ....జీనియస్‌ దర్శకుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో నటించడం అమితమైన ఆనందం. చిత్రీకరణ కోసం ఎదురుచూస్తున్నా. శింబుతో కలిసి మూడో చిత్రంలో నటిస్తున్నానని ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సినిమాకు అరవింద్‌ కృష్ణ సినిమాటో గ్రాఫర్‌గా వ్యవహరించనున్నారు.


English summary
Now Trisha finally opened on the break up and made following tweet.‘’Amused by d hazaar speculations doin d rounds.Let it rest people.Happy,single n thankful’’ Trisha Krishnan ‏trishtrashers
Please Wait while comments are loading...