వాజ్‌పేయి మరణం: సంతాపంగా ‘శైలజా రెడ్డి’ అల్లుడు సాంగ్ రిలీజ్ వాయిదా!
భారత మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు అటల్ బిహారీ వాజ్‌పేయి మరణం నేపథ్యంలో సర్వత్రా విషాద ఛాయలు అలుముకున్న నేపథ్యంలో 'శైలజారెడ్డి అల్లుడు' చిత్ర బృందం తమ సాంగ్ రిలీజ్‌ను వాయిదా వేసుకుంది.
దీనిపై దర్శకుడు మారుతి ట్వీట్ చేస్తూ 'మనం అద్భుతమైన నాయకుడిని కోల్పోయాం. ఈ బాధలో మాటలు రావడం లేదు. వాజ్‌పేయి హఠాన్మరణం నేపథ్యంలో ఈ రోజు విడుదల చేయాల్సిన మా 'శైలజా రెడ్డి అల్లుడు' రెండో పాటను రేపటికి వాయిదా వేస్తున్నాం' అని పేర్కొన్నారు.
మారుతి దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'శైలజారెడ్డి అల్లుడు'. సితార ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చైతు సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. చైతుకి అత్తగా.. శైలజారెడ్డి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.

శైలజా రెడ్డి అల్లుడు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాను ఆగస్ట్ 31న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. 'శైలజా రెడ్డి అల్లుడు' చిత్రానికి మారుతి దర్శకత్వం వహంచడం కూడా అంచనాలు మరింత పెంచింది. ఫ్యామిలీ, యూత్ మెచ్చే చిత్రాలు తీసే దర్శకుడిగా మారుతికి మంచి పేరుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి.


Click it and Unblock the Notifications











