»   » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సాడ్ న్యూస్

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సాడ్ న్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సక్సెస్ మీట్లకు, మీడియా సమావేశాలకు ఆమడ దూరంలో ఉండే పవన్ కళ్యాణ్ తొలిసారిగా ధాంక్స మీట్ పెట్టాలనుకున్న సంగతి తెలిసిందే. . ఈ అక్టోబర్ 6 (ఆదివారం) , హైదరాబాద్‌లో శిల్పకళా వేదికలో ఈ సక్సెస్ మీట్ గ్రాండ్‌గా ఏర్పాటు చేద్దామనుకున్నారు. అయితే రాష్ట్రంలో పరిస్ధితులు ఒక్కసారిగా మారటంతో దాన్ని కాన్సిల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

క్లిష్ట పరిస్థితుల్లో విడుదలైన ఈచిత్రం విడుదలకు ముందే పైరసీకి గురైన సంగతి తెలిసిందే. అయినా సరే ప్రేక్షకులు సినిమాను భారీగా విజయవంతం చేసారు. ఈ నేపథ్యంలో ప్రేక్షక దేవుళ్లకు, అభిమానులకు థాంక్స్ చెప్పేందుకు భారీ సమావేశం ఏర్పాటు చేద్దామనుకున్నారు.

అత్తారింటికి దారేది' రిలీజైన రోజు మార్నింగ్ షో నుంచి ఓ రేంజి కలెక్షన్స్ లో దూసుకుపోతోంది. ఈ చిత్రం కొత్త కొత్త రికార్డులు అంతటా క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం హవాకి సీనియర్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా తమిళ, హిందీ నుంచి భారీ మొత్తాలతో రీమేక్ రైట్స్ కోసం పోటీ పడుతూండటం ఈ చిత్రం సాధించిన పెద్ద రికార్డు గా చెప్తున్నారు. ట్రేడ్ లో చెప్పబడుతున్న ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ప్రకారం దాదాపు 35 కోట్లు వరకూ ఎపి షేర్, 49 కోట్ల వరకూ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ వచ్చిందంటున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
For the first time in the recent times, Pawan Kalyan wanted to meet the press and fans at a success meet as his Atharintiki Daaredi became a blockbuster crossing all hurdles. The event even was christened as 'Thank You' meet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu