»   » అత్తారింటికి దారేది : నైజాంలో నితిన్ ప్లాన్ అదిరింది

అత్తారింటికి దారేది : నైజాంలో నితిన్ ప్లాన్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం నైజాం ఏరియాలో రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా 'అత్తారింటికి దారేది' చిత్రం కూడా అదే స్థాయిలో చరిత్ర సృష్టించబోతోందా? అంటే అవుననే నమ్మకం వ్యక్తం చేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు.

  ఈ చిత్రం నైజాం రైట్స్ పవన్ వీరాభిమాని, నటుడు అయిన నితిన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు నితిన్. తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆగస్టు 7న విడుదల కాబోతున్న 'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నైజాంలో రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు 320కి పైగా థియేటర్లను కేటాయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట.

  పవర్ స్టార్ సినిమా కాబట్టి థియేటర్లు ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయని, కలెక్షన్ల వర్షం కురిపిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తే ఈ చిత్రం టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయం అంటున్నారు.

  యాక్షన్, కామెడీ, రొమాన్స్

  యాక్షన్, కామెడీ, రొమాన్స్

  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

  భారీ బడ్జెట్ మూవీ...

  భారీ బడ్జెట్ మూవీ...

  ఈ సినిమా కోంస భారీ గా ఖర్చు పెట్టారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ఈచిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో జతకలిసి నిర్మిస్తున్నారు. మరో నిర్మాత భోగవల్లి బాపినీడు ‘అత్తారింటికి దారేది' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

  వసూళ్ల వరద ఖాయం

  వసూళ్ల వరద ఖాయం

  సినిమాకు వసూళ్లు భారీగా వస్తాయని ఆశిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ‘అత్తారింటికి దారేది' చిత్రం బిజినెస్ అదిరి పోయింది. సినిమాకు సంబంధించిన అన్ని రకాల హక్కులు ముందస్తుగానే రికార్డు స్థాయి ధరకు అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ కావడమే ఈ పరిణామాలకు కారణం.

  త్రివిక్రమ్ డైలాగ్స్ అదుర్స్

  త్రివిక్రమ్ డైలాగ్స్ అదుర్స్

  స్వతహాగా రచయిత అయిన త్రివిక్రమ్ ఈ చిత్ర స్ర్కిప్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. ఈ చిత్రంలో అదిరిపోయే కామెడీ సీన్లతో పాటు, పంచ్ డైలాగులు ప్రేక్షకులను అలరించనున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో అత్తాపూర్ బాబాగా కనిపించబోతున్నారు. ఈ సన్నివేశం థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుందని యూనిట్ సభ్యలు అంటున్నారు.

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  నటీనటులు, సాంకేతిక నిపుణులు

  పవన్ కళ్యాణ్, సమంత, ప్రణీత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

  English summary
  Atharintiki Daredi Massive release in Nizam With time ticking for the release of Power Star Pawan Kalyan’s Atharintiki Daredi on August 7th, here is one more news about the film. Pawan’s hard-core fan Nitin is releasing this film in Nizam and that too in record number of theaters.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more