Just In
- 7 min ago
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 1 hr ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
టీమిండియా ఆటగాళ్లకు మరో కొత్త టెస్ట్.. 8 నిమిషాల్లోనే 2 కిమీ!! ఎన్నిసార్లంటే?
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకింగ్:దర్శకుడు రాఘవేంద్రరావుపై రాడ్ తో దాడి, ఖరీదైన కార్లు ధ్వంసం
హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావుపై ఓ యువకుడు దాడికి యత్నించిన విషయం సంచలనం సృష్టించింది. ఈ సంఘటన గురువారం ఆయన ఇంటికి దగ్గరలో చోటుచేసుకుంది.కాస్త లేటుగా బయిటకు వచ్చింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో .
పోలీసులు చెప్తున్న వివరాలు ప్రకారం.. ఈ దాడికి పాల్పడింది అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన వల్లిపి రవీంద్ర(28). అతను గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిలింనగర్ సైట్-2లో నివసించే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఇంటికి వచ్చాడు.
అదే సమయంలో రాఘవేంద్రరావు తన కారులో బయటకు వెళ్తుండగా రవీంద్ర కారును అడ్డగించి ఆయనను తిడుతూ డోరు పగలగొట్టేందుకు యత్నించాడు. దీంతో అక్కడున్న వాచ్‌మెన్ కె.బాబు అడ్డుకున్నాడు. వాచ్‌మెన్‌ను కిందకు తోసేసి మళ్లీ రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్లి ఆయనను బయటకు లాగేందుకు యత్నించాడు.
ఇది గమనించిన కారు అద్దాలు దించిన రాఘవేంద్రరావు 'ఎవరు నువ్వు.. నీ ప్రాబ్లం ఏంటి' అంటూ ప్రశ్నించాడు. అప్పుడు అతను రాఘవేంద్రరావుగారితో తను రాసిన కథ కాపి కొట్టి సినిమా తీసావని ఆరోపించాడు.
మిగతా కథనం ..స్లైడ్ షోలో...

ఆ కథ నాదే
2006లో తెరకెక్కించిన 'శ్రీరామదాసు' సినిమా కథ తనదేనని, ఆ కథను 2003లోనే రూపొందించి మీకు పంపించానని అన్నారు.

మోసం చేసావు
సినిమాలో మాత్రం కథ రచయితగా తన పేరు పెట్టకుండా మోసంచేశారంటూ రాఘవేంద్రరావును నిలదీశాడు రవీంద్ర.

భారవిది
ఆ సినిమా కథ జేజే భారవిదని నీది కాదని రాఘవేంద్రరావు చెప్తుండగానే రవీంద్ర ఆయనను దూషిస్తూ సినిమా కథ తనదైతే ఆయన పేరు ఎలా పెడతావని ప్రశ్నించారు.

తీవ్ర అన్యాయం
ఈ విషయంలో తనకు తీవ్ర అన్యాయం చేశావని ఆరోపిస్తుండగానే రాఘవేంద్రరావు కారులో వెళ్లిపోయారు.

అక్కడితో ఆగక..
ఆ తర్వాత రవీంద్ర ఎదురుగా నిర్మాణంలోని భవనంలో ఓ రాడ్‌ను తీసుకొని రాఘవేంద్రరావు నివాసంలోకి చొచ్చుకెళ్లాడు.

కార్లన్ని ధ్వంసం
అక్కడ ఉన్న ఆడి కారు, బెంజి కారు, పక్కనే సాంత్రో కార్లను ధ్వంసం చేశాడు.

వాచ్ మెన్ పై దాడి
ఇంటి అద్దాలు పగలగొట్టాడు. అడ్డువచ్చిన వాచ్‌మెన్‌పై దాడి చేశాడు.

నిలదీసాడు..
ఇళ్లంతా భీభత్సం సృష్టిస్తున్న సమయంలో రాఘవేంద్రరావు కొడుకు ప్రకాశ్ రావు బయటకు వచ్చి ఏం చేస్తున్నావంటూ నిలదీశాడు.

ప్రకాష్ పైన కూడా..
రాఘవేంద్రరావు కుమారుడుపై కూడా దాడి చేయడానికి యత్నిస్తున్న సమయంలో వాచ్‌మెన్ బాబు వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడు.

సెక్యూరిటీ గదిలో..
ప్రకాశ్‌రావు కూడా రవీంద్రను పట్టుకొని సెక్యూరిటీ గదిలో వేసి పోలీసులకు సమాచారం అందించారు.

పోలీస్ లు అరెస్ట్
బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రవీంద్రను అరెస్టు చేశారు.

రిమాండ్ కు
రవింద్రపై ఐపీసీ సెక్షన్ 452, 427కింద కేసులు నమోదుచేసి రిమాండ్‌కు తరలించారు.

రెక్కీ చేసాడు
కాగా, నిందితుడు రవీంద్ర బుధవారం సాయంత్రమే రాఘవేంద్రరావు ఇంటి ముందు రెక్కీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

ప్రయత్నం చేసాడు
బుధవారమే ఆయన ఇంట్లోకి చొరబడేందుకు ప్రయత్నించాడని, అవకాశం లేకపోవడంతో గురువారం మళ్లీ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మరింత సెక్యూరిటి
ఈ ఘటన రాఘవేంద్రరావును మాత్రమే కాక సినిమా వర్గాల వారిని సైతం భయభ్రాంతులకు గురి చేసింది. తమ ఇళ్లకు సెక్యూరిటీ మరింత పటిష్టంగా ఉండాలనే విషయం చెప్పినట్లు అయ్యింది