twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉత్సాహంలో పవన్ కళ్యాన్ ఫ్యాన్స్-కంగారుపడ్డ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' చిత్రం నవంబర్ 15తో 50 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులంతా మరోసారి థియేటర్లకు క్యూ కట్టారు. హైదరాబాద్‌లో సినిమా థియేటర్ల సెంటర్‌గా పేరుగాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సంధ్య థియేటర్లో 'అత్తారింటికి దారేది' చిత్రం ప్రదర్శితమవుతోంది.

    50 రోజుల పండగను పురస్కరించుకుని భారీగా అభిమానులు తరలివచ్చారు. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సాంగ్ మొదలవ్వగానే అభిమానులంతా స్క్రీన్ ముందుకు దూసుకెళ్లారు. ఈలలు వేస్తూ, కేరింతలు కొడుతూ డాన్స్ చేయడం ప్రారంభించారు. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ స్క్రీన్ ముందుకు చేరుకోవడంతో......స్క్రీన్‌కు ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమోనని థియేటర్ యాజమాన్యం కంగారుపడింది.

    ఇలాంటి చర్యల వల్ల సినిమా చూసే ఇతర ప్రేక్షకులు ఇబ్బంది పడతారు కాబట్టి థియేటర్లో ఎవరైనా స్క్రీన్ ముందుకు వెళితే....కర్రలతో రెడీగా ఉండే సిబ్బంది వారిని బలవంతంగా బయటకు లాక్కెలుతారు. అయితే పవన్ ఫ్యాన్స్ భారీగా ఉండటం అలాంటి ధైర్యం చేయలేక పోయింది యాజమాన్యం. అభిమానులు కిందకి దిగేలా బుజ్జగించే ప్రయత్నం చేస్తూ....స్క్రీన్‌పై ప్రత్యేకంగా స్లైడ్స్ ప్రదర్శించింది.

    థియేటర్ యాజమాన్యం విజ్ఞప్తిని అర్థం చేసుకున్న అభిమానులు ఇంట్రడక్షన్ సాంగ్ పూర్తవగానే బుద్దిగా ఎవరి సీట్లో వారు వచ్చి కూర్చోవడంతో యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. థియేటర్లో పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామాకు సంబంధించిన ఫోటోలు కొందరు అభిమానులు సోషల్ నెట్వర్కింగులో పోస్టు చేసారు.

    100 కోట్ల దిశగా...

    100 కోట్ల దిశగా...


    ఇప్పటికే రూ. 85 కోట్లకు పైగా వసూలు చేసిన అత్తారింటికి దారేది చిత్రం 100 కోట్ల మార్కును అందుకునే దిశగా పరుగులు పోడుతోంది.

    అత్తారింటికి దారేది

    అత్తారింటికి దారేది


    పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్‘అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు.

    తెరపై, తెర వెనక

    తెరపై, తెర వెనక


    నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

    పవన్ కళ్యాణ్

    పవన్ కళ్యాణ్


    ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్-2' చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని పవన్ కళ్యాన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. డిసెంబర్ చివర్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాబోతోంది. 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్' చిత్రం విడుదలైన తేదీనే అంటే...మే 11, 2014న విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు.

    కేక్ కట్టింగ్

    కేక్ కట్టింగ్


    అత్తారింటికి దారేది చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేస్తున్న దృశ్యం.

    English summary
    Pawan Kalyan's ‘Attarintiki Daredi’ 50 days hungama Sandhya RTC X roads. The movie completed its 50-day run at the box office yesterday. According to reports, "AD" will complete 50 days in approximately 170 theatres - a rare feat for a Telugu film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X