»   » ‘అత్తారింటికి దారేది’ కిరాక్ డైలాగ్ అదిరింది

‘అత్తారింటికి దారేది’ కిరాక్ డైలాగ్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రం ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ పరిస్థితుల కారణంగా విడుదల నిలిచి పోయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలోని డైలాగు కొన్ని బయటకు లీక్ అవుతూ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. 'వన్ లైనర్' డైలాగులకూ, కామెడీకీ పెట్టింది పేరైన త్రివిక్రమ్ ఈ సినిమాలోనూ తనదైన రీతిలో డైలాగులు అదరగొట్టారు. తాజాగా 'అత్తారింటికి దారేది' చిత్రానికి సంబంధించిన మరో డైలాగ్ ఇప్పుడు నెట్లో హల్ చల్ చేస్తోంది. ఆ డైలాగ్ ఏమిటంటే...

సమంత : నువ్వు కొంచెం అల్లరి ఎక్కువ చేస్తున్నావ్ అనిపించింది కానీ, నువ్వు అలా ఉంటనే చాలా బాగున్నావ్
పవన్ : అహ..అహ..నువ్వు నా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతుంటే పాకిస్థాన్‌లో జనగనమన విన్నంత కిరాక్‌గా ఉందే....

గతంలో లీకైన డైలాగగులు...
ప్రణీత,పవన్ మధ్య డైలాగు
ప్రణీత: "నువ్వు ఐ మూలగా(డైయగ్నల్) అంటూ అమ్మాయిలకు ఏదో లెక్చర్ ఇస్తావంటగా....?"
పవన్: "అది అంతా అలాంటి అండర్ కలర్ బ్యూటీస్ కి బుజ్జీ...నువ్వు ఎటు చూసినా...ఎలా చూసినా పిల్లోడు నాశనం."

పవన్ ,అలీ మధ్య డైలాగు
అలీ - "ఈ పిల్ల ని బౌండరీ దాటించటం అంత ఈజీ కాదు, చాలా భారీ ఫీల్డింగ్ పెట్టాడు వాడు".
పవన్- "చూడమ్మా సింగిల్ కొట్టాలి అనుకున్నవాడే ఫీల్డర్ ని చూసి ఆడతాడు. నాలాగ సిక్స్ కొట్టాలి అని ఫిక్స్ అయిన వాడికి ఫీల్డర్ ఎక్కడున్న పెద్దగా ఏ ఫీలింగ్ ఉండదు ".

పవన్‌కి, సమంతకి మధ్య జరిగే సంభాషణ...
పవన్ : నీతో నేనూ వస్తా
సమంత : రెండూ అంటే కుదరదు... అయితే సినిమాకి, లేదా షాపింగ్‌కి, డిసైడ్ చేస్కో ఎక్కడికి వస్తావో...
పవన్ : తిరుపతికి తీసుకు వెళ్ళి దర్శనం కావాలా, ప్రసాదం కావాలా ...అంటే నా లాంటి భక్తుడు యేమి డిసైడ్ చేసుకుంటాడు చెప్పు....

'అత్తారింటికి దారేది' చిత్రాన్ని సెప్టెంబర్ చివరలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 20న గానీ, సెప్టెంబర్ 27న కానీ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి ఈ చిత్రం క్లీన్ 'U' సర్టిఫికెట్ పొందింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బివిఎస్ఎన్ ప్రసాద్ రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ ఈచిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా వినోదాత్మకంగా తెరకెక్కించారు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి.

ఈచిత్రంలో నదియా పవన్ కళ్యాణ్ పాత్రలో, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
Here are one new leaked dialogues from Attarintiki Daredi movie, which are spreading like wild fire in social networking sites from few hours. Samantha - "Nuvvu konchem allari ekkuva chestunnav anipinchindi kani...ala Unte chala bagunnav" Pawan Kalyan - "ahha..ahha..nuvvu na gurinchi positive ga matladutunte pakistan lo janaganamana vinnatha kirakga undi."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu