»   » 'అత్తారింటికి దారేది' యాభైరోజుల గురించి నిర్మాత

'అత్తారింటికి దారేది' యాభైరోజుల గురించి నిర్మాత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'అత్తారింటికి దారేది' చిత్రంతో పవన్‌కల్యాణ్‌ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు.ఆరడుగుల బుల్లెట్టుగా దూసుకొచ్చాడు. మరదళ్లతో కలిసి పసందైన వినోదాలు పంచాడు. బాక్సాఫీసు ముందు వసూళ్ల వర్షం కురిపించాడు. సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటించారు. త్రివిక్రమ్‌ దర్శకుడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత. ప్రతికూల పరిస్థితుల్లో విడుదలై చక్కటి విజయాన్ని సొంతం చేసుకొందీ చిత్రం. శుక్రవారంతో 50రోజుల మైలురాయిని చేరుకొంటుంది.

నిర్మాత మాట్లాడుతూ ''తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ల (షేర్‌)ను సొంతం చేసుకొన్న చిత్రమిది. పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ కలయికలో రూపొందడం వల్లే ఈ చిత్రం ఇంతటి ఘన విజయాన్ని సాధించింది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం, సమంత అందం కలిసొచ్చాయి. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ చిత్రానికి మంచి వసూళ్లు లభిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకాదరాభిమానాలతో ఈ చిత్రం వందరోజుల దిశగా దూసుకెళుతోంది''అన్నారు.

'అత్తారింటికి దారేది' చిత్రం 15వ తేదీతో 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. ఈ సందర్భంగా నిర్మాత ప్రెస్ నోట్ విడుదల చేసారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం 50 రోజుల్లోనూ సినిమా బక్సాఫీసు వద్ద స్ట్రాంగ్‌గా రన్ అవుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదంతా పవన్ కళ్యాణ్ ఎఫెక్టే అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈచిత్రం 170 సెంటర్లలో 50 రోజులు వేడుక జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary

 Pawan Kalyan's "Attarintiki Daredi" (AD) is all set to complete its 50-day run at the box office on Friday (15 November). According to reports, "AD" will complete 50 days in approximately 170 theatres - a rare feat for a Telugu film. The family entertainer has fared well in overseas markets as well. The film has reportedly earned a worldwide share of around ₹73.9 crore at the end of the seventh weekend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu